YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 12 December 2012

సమస్యలను విన్నవించిన గిరిజనులు, రైతులు, వృద్ధులు



 గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జగనన్న తప్పకుండా తీరుస్తారని.. అన్నను మీరంతా ఆదరించాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. బుధవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మండలంలోని మన్సాన్‌పల్లి, మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖాల్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంది. అంతకుముందు మహేశ్వరంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళలను, రైతులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. బాబు హయాంలో రాష్ట్రంలో సుమారు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు.

రాజన్న హయాంలో మహేశ్వరం ధనేశ్వరంగా మారిందని.. నేడు కిరణ్ పాలనలో ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం లేకనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలేదని.. ఒకవేళ ఎన్నికలు పెడితే సీట్లన్నీ వైఎస్సార్ సీపీనే గెలుచుకొంటుందనే భయం వారిని వెంటాడుతోందని విమర్శించారు. జగనన్న సీఎం కాగానే మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తారన్నారు. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ.1000 చొప్పున ఫించన్లు అందజేస్తారన్నారు. ఇది తొందరలోనే నెరవేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.

సమస్యలను విన్నవించిన గిరిజనులు, రైతులు, వృద్ధులు
మహేశ్వరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళలు తమ సమస్యలను షర్మిలకు ఏకరువు పెట్టారు. ఒక్కో ఇంటికి నెలకు రూ.800 కరెంటు బిల్లు వస్తోందని, ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలేదన్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గిరిజన తండాలు, గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా వారు పట్టించుకోవడంలేదని షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. సిరిగిరిపురం జరిగిన రచ్చబండలో స్థానికులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. రైతులను పీడించి వ్యవసాయ కరెంటు బిల్లులు, సర్‌చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. గ్రామంలో తాగడానికి సరిపడా నీరు కూడా లేదని.. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగనన్న సీఎం కాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. హర్షగూడలో పలువురు మైనారిటీ మహిళలు సమస్యలను షర్మిల దృష్టికి తెచ్చారు. ‘వైఎస్ హయాంలో మంజూరైన వృద్ధాప్య పిం ఛన్లు కూడా ప్రస్తుతం చాలా మందికి రావ డం లేదు..తిరిగి అందరికీ గతంలో మాదిరే పింఛ న్లు రావాలంటే జగన్ ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుందమ్మా’ అంటూ పలువురు వృద్ధులు అభిప్రాయపడ్డారు. మంఖాల్ గ్రామం సమీపంలోని చేలల్లో ఉన్న రైతుల వద్దకు షర్మిల వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీసం పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడంలేదని వారు ఆమెతో వాపోయారు. విత్తనాల ధర కంటే కూడా మద్దతు ధర తక్కువగా ఉందని, ఇలాగైతే అప్పుల ఊబి నుంచి రైతులు బయటపడేదెట్లమ్మా... అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

హర్షగూడలో పూలపై నడిపించిన గిరిజనులు...
హర్షగూడలో దారి పొడవున బంతి, చామంతి పూలను పరిచి షర్మిలను వాటిపై నుంచి నడిపించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ప్రారంభించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మంఖాల్ ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సాయంత్రం తుక్కుగూడలో భారీ స్థాయిలో జనం హాజయ్యారు. షర్మిల పాదయాత్రలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ జనార్దన్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ వెంకటప్రసాద్, ఎస్సీసెల్ కన్వీనర్ రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీసెల్ కన్వీనర్ పాండు నాయక్, జిల్లా స్టీరింగ్ సభ్యులు బొక్క జంగారెడ్డి, మహేందర్‌రెడ్డి, పాండుయాదవ్, మండల కన్వీనర్ రాఘవేందర్‌రెడ్డి, అనంతయ్య, గోపాల్‌నాయక్, తుక్కుగూడ మాజీ సర్పంచ్ కళ్లెం కృష్ణాగౌడ్, జనార్దన్‌రెడ్డి, దర్శన్‌రెడ్డి, శేఖర్, శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్, ప్రసాద్. సాల్మన్, ప్రకాష్, అంజయ్య, రమేష్, దస్రునాయక్, రాజు, మోహన్, లచ్చానాయక్, సేవ్యానాయక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!