ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మృతిపట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మూడుసార్లు గ్రామీ అవార్డులతో పాటు అత్యున్నత భారతరత్న పురస్కారం కూడా అందుకున్న రవిశంకర్ ... తనదైన ముద్రతో, సృజనాత్మకతతో భారతీయ శాస్త్రీయ సంగీతంతో పాశ్చాత్య ప్రపంచాన్ని మంత్రముగ్థుల్ని చేశారని వైఎస్ విజయమ్మ నివాళులు అర్పించారు. భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఆయన సంగీత మేరు శిఖరమని, రవిశంకర్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. పండిట్ రవిశంకర్ కుటుంబ సభ్యులకు వైఎస్ విజయమ్మ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment