వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు అందించే సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా జనంలో తిరుగుతూ ప్రచారం చేయాలని పార్టీఅనుబంధ విభాగ ప్రచార కమిటీ నిర్ణయించింది. వైఎస్సార్ సీపీపై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రచార కమిటీ సమన్వయకర్త టి.ఎస్.విజయచందర్ నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ ప్లీనరీలో అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వైనంపై ప్రజల్లో చర్చ తీసుకురావాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రపాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు, సీఈసీ సభ్యులు కె.శివకుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ అసిస్టెంట్ కోఆర్డినేటర్ జొన్నల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొని సలహాలు, సూచనలు అందజేశారు.
sakshi
sakshi
No comments:
Post a Comment