ఎఫ్‌డీఐని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో టీడీపీ ప్రసంగాలు
మరోవైపు ఎఫ్‌డీఐ కోసం హెరిటేజ్ సంస్థ ప్రణాళిక
రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తాము వ్యతిరేకమంటూ పార్లమెంటు లోపలా వెలుపలా వక్కాణిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్.. రిటైల్ రంగంలో విదేశీ వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ చిన్న వ్యాపారుల పొట్ట కొడుతుందని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కొద్ది రోజుల కిందటే పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు ప్రసంగించారు. ఉభయ సభల్లోనూ ఎఫ్‌డీఐకి వ్యతిరేకంగా ఓటేశారు కూడా. అయితే ఒకవైపు ఎఫ్‌డీఐపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగానే.. ఎఫ్‌డీఐతో తమ సంస్థను విస్తరించే ప్రణాళికలు రూపొందించినట్లు టీడీపీ అధినేత కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
1992లో పాల డెయిరీ వ్యాపారంతో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్, కొద్ది సంవత్సరాల క్రితం హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో రిటైల్ దుకాణాల్ని కూడా ఏర్పాటుచేసింది. తాజా విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ రిటైల్ వ్యాపారాన్ని వేరుచేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ పేరుతో ఒక సంస్థను కూడా రిజిస్టర్ చేసి సిద్ధంగా ఉంచారు. రిటైల్ వ్యాపారాన్ని వేరుపర్చి, దేశీయ లేదా విదేశీ భాగస్వామిని చేర్చుకునే ప్రతిపాదనకు తమ డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసిందంటూ కంపెనీ ప్రెసిడెంట్ సాంబశివరావును ఉటంకిస్తూ కొన్ని పత్రికల్లో ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ లోపే ఎఫ్‌డీఐ ఓటింగ్ గురించి తెలుగుదేశం పార్టీపై విమర్శలు వెల్లువెత్తటంతో.. కంపెనీ హడావుడిగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక వివరణను సమర్పించింది. ప్రమోటర్లు (చంద్రబాబు కుటుంబం) వాటాను అమ్మబోరని, రిటైల్ వ్యాపారానికి ఒక వ్యూహాత్మక భాగస్వామితో (విదేశీ అనే మాటలేకుండా) జతకట్టేందుకు సిద్ధమన్నది ఆ వివరణ సారాంశం.

No comments:
Post a Comment