దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రతీ పేదవాడి ఇంట్లో వెలుగులు నింపారని మాజీ ఐఏఎస్ అధికారి, 2009లో పీఆర్పీ తరఫున తిరుపతి పార్లమెంట్‌కు పోటీచేసిన ఎం.వరప్రసాద్ అన్నారు. సోమవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వరప్రసాద్, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పేద ప్రజలు వైఎస్ హయాంలో లబ్ధి పొందినంతగా రాష్ట్ర చరిత్రలో మరెప్పుడూ లబ్ధి పొందలేదన్నారు. రైతులకు వైఎస్ చేసిన కృషిని చూస్తే.. వారి కోసమే ఆయన జన్మించారనే విధంగా తోడ్పాటు అందించారన్నారు. అన్ని పథకాలూ ఆయన కులం, మతం అనే తేడా లేకుండా అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వై.వి. సుబ్బారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. |
Monday, 10 December 2012
వైఎస్ ఐదేళ్ల పాలనలో ప్రతీ పేదవాడి ఇంట్లో వెలుగులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment