చిల్లర వ్యాపారాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డిఐ)కు సంబంధించి రాజ్యసభలో జరిగిన ఓటింగ్ విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తప్పు చేసి ఎంపీలపై నెట్టడం ఎంతవరకు సబబని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యుడు డి.ఎ.సోమయాజులు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎఫ్ డిఐలపై చంద్రబాబు వైఖరి ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఎఫ్ డిఐల వల్ల హెరిటేజ్ సంస్థకే నేరుగా లబ్ది చేకూరుతుందని చెప్పారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హెరిటేజ్ లోకి ఎఫ్ డిఐలకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. అందరినీ మోసం చేయాలని చూసి చంద్రబాబే బుట్టలో పడ్డారన్నారు. చంద్రబాబు సొంత వ్యాపారాల పరంగా ఎఫ్ డిఐలను సమర్థిస్తున్నారని చెప్పారు. ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేస్తే సమస్యలేదన్నారు. అయితే పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారన్నారు. ఎఫ్ డిఐలపై స్పష్టత లేకపోవడం వల్లే ఆయన చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, అది ఎంతవరకు సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రుణాల మాఫీపై చంద్రబాబు విధాన నిర్ణయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రుణ మాఫీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

No comments:
Post a Comment