పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రూ.11 కోట్ల బకాయిలను డిసెంబర్ 23వ తేదీలోపు రైతులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లికపోతే 24న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు సంవత్సరకాలంగా బకాయిలు చెల్లించకుండా రైతులు, కార్మికులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రసన్నకుమార్‌రెడ్డి వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment