తెలుగుదేశం అధినేత పయ్యావుల కేశవ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ జెండా కట్టినందుకే సూరయ్యను పయ్యావుల అనుచరులు చంపేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మృతుడి భార్య ఓబులమ్మను పయ్యావుల సోదరులు బెదిరిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. హత్యకేసులో నిందితుడిగా ఉన్న పయ్యావుల సోదరుడు శ్రీనివాస్‌కు గన్‌మెన్‌లను ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. సూరయ్య హత్యకేసులో విచారణ చేస్తే పయ్యావుల నిజస్వరూపం బయటపడుతుందని వైఎస్ఆర్ సీపీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment