ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడుగా బాబు ఉండటానికి వీలులేదని ఆయన సోమవారమిక్కడ డిమాండ్ చేశారు. టీడీపీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టి ఆపార్టీకి తొత్తుగా మారారని భూమా నాగిరెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబు ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఎఫ్ డీఐ ఓటింగ్ లో తేలిపోయిందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో పురందేశ్వరి చేసేది రాజకీయం అయితే బాబు చేసేది ఏంటని భూమా సూటిగా ప్రశ్నించారు. రాబోయే స్థానిక కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.

No comments:
Post a Comment