జగన్ కేసులో సీబీఐ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి కోటి సంతకాలతో వినతిపత్రం ఇవ్వాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ‘కోటి సంతకాల సేకరణ’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మొదలైంది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో పెద్దసంఖ్యలో వినతిపత్రంపై సంతకాలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం కన్వీనర్ మధు సంపత్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. సీబీఐ కక్షపూరిత ధోరణిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దివంగత వైఎస్ విగ్రహం వద్ద జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి చేపట్టిన సంతకాల సేకరణలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. జగన్‌ను విడుదల చేయూలంటూ విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు చేశారు. మరోవైపు దుబాయ్ లోనూ ప్రవాసాంధ్రులు జగన్ కోసం సంతకాలు సేకరిస్తున్నారు.
No comments:
Post a Comment