ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...
జగన్ కోసం... జనం సంతకం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..
ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.
మీరూ చేయికలపండి!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.
No comments:
Post a Comment