పామర్రు: వైఎస్ జగన్ కు కాంగ్రెస్ క్షమాపణ చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో భవిష్యత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తమ పార్టీ ఏ పార్టీలోనూ విలీనం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు మునుగుతున్న పడవలని ఆయన ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా ఈ రెండు పార్టీలు తమ పార్టీ కాళ్ల దగ్గరకు రావాల్సిందేనన్నారు. ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు ఖాళీ అవడం ఖాయమన్నారు. తమది బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోరే పార్టీ అని పేర్కొన్నారు. పాదయాత్ర జపం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
TRUE;
ReplyDelete