వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేడు (బుధవారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు), టీడీపీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలగిన ఉప్పులేటి కల్పన, కాంగ్రెస్‌ను వీడిన కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, వీవీఆర్ హౌసింగ్ అధినేత వాకా వాసుదేవరావు తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా పామర్రులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొంటారని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను సంయుక్త ప్రకటనలో తెలిపారు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరుతున్న విజయమ్మ 5 గంటలకు విజయవాడ చేరుకుని అక్కడి నుంచి పామర్రుకు 6 గంటలకు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు గ్రామానికి వెళ్లి అక్కడ ఇటీవల పెద్దపులిపాక వద్ద కృష్ణానదిలో మునిగి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తరువాత నేరుగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

No comments:
Post a Comment