హైదరాబాద్, న్యూస్‌లైన్:
సేవ్ కాంగ్రెస్ పేరుతో జూబ్లీహాల్‌లో సమావేశమై వైఎస్‌పై అక్కసుతో ఆయన్ను, జగన్‌ను, వైఎస్సార్‌సీపీని తిట్టడమే మేధోమథనమా అంటూ కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, చిరంజీవిలపై ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు నిప్పులు చెరిగారు. ఆదివారం సచివాలయంలో గోనె విలేకరులతో మాట్లాడారు. ‘‘వీహెచ్‌గారు నిర్వహించిన మేధోమథనం సద స్సులో చిరంజీవి అధిక ప్రసంగం చేశారు.
తినేది ఇక్కడ, పాడేది అక్కడ అంటూ పరోక్షంగా వైఎస్సార్ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఢిల్లీలో డైరీ ఆవిష్కరణ సందర్భంగా పాల్గొన్న కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమానులను అన్నట్టుగా అర్థమవుతోంది. కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి, మంత్రి స్థాయికి తీసుకొచ్చాడని వాళ్లకు కృతజ్ఞత ఉంది కాబట్టే వైఎస్ డైరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు నీకు సిగ్గూ లజ్జా ఉందా అని అడుగుతున్నా. ఇక్కడ కూలీనాలీ చేసి నీకు టికెట్ల రూపంలో డబ్బులిస్తే.. చెన్నై అకౌంట్ ద్వారా ఆదాయపు పన్ను కడుతున్నావ్. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడితే ఎలా? సొంత జిల్లాలోని పాల కొల్లులో గెలవలేదు. తిరుపతిలో రాజీనామా చేశాక అక్కడా గెలిపించలేదు. నువ్వు విమర్శలు చేస్తావా’’ అని దుయ్యబట్టారు. ‘‘వీహెచ్ గారికి మంచి మిత్రుడిగా సవాలు చేస్తున్నా. గతంలో నువ్వు పోటీచేసిన నియోజకవర్గాల్లో పోటీ చెయ్యి. ఒక్క చోటైనా గెలువు. అలా గెలిస్తే నీ దగ్గర అటెండర్‌గా పనిచేస్తా..’’ అని అన్నారు.
No comments:
Post a Comment