హైదరాబాద్, న్యూస్‌లైన్: శాసనసభ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మద్దతును ప్రకటించారు. మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని విజయమ్మకు అందజేశారు. పార్లమెంటులోనూ అంబేద్కర్ విగ్రహం ఉందని.. అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేసేలా చూడాలని కవిత విజ్ఞప్తి చేశారు. దీనిపై విజయమ్మ స్పందిస్తూ.. అంబేద్కర్ మహాశయుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరికీ అభ్యంతరం ఉండరాదని.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ తరపున ఈ విషయాన్ని లేవనెత్తి.. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరతామని కవితకు హామీ ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, మద్దతు ప్రకటించినందుకు విజయమ్మకు ధన్యవాదాలు తెలిపారు.
Tuesday, 11 September 2012
అసెంబ్లీలో అంబేద్కర్ విగ్ర హ ఏర్పాటుకు విజయమ్మ మద్దతు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment