హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త టి. దుర్గారెడ్డి కువైట్‌లో నిర్మించిన చర్చి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి బ్రదర్ అనిల్‌కుమార్ హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కూడా ఈ పర్యటనలో పాల్గొనగా, ఆమెను కలుసుకోవడానికి అక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారని పార్టీ నాయకుడు ఇలియాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే చర్చి సమావేశ కార్యక్రమాన్ని బహిరంగ స్థలంలో ఏర్పాటు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశ నిర్వహకులు పరిస్థితిని కువైట్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ముబారక్ అల్ దొవే దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన జోక్యం చేసుకుని పరిస్థితిని అధికారులకు వివరించగా.. కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంలో నిర్వహించుకోవడానికి కువైట్ యునెటైడ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ అనుమతించింది. దానికి అవసరమైన భద్రత కూడా కల్పించింది.
బ్రదర్ అనిల్ అరెస్టు అవాస్తవం: బ్రదర్ అనిల్ కుమార్ ను కువైట్‌లో అరెస్టు చేశారంటూ ఒక వర్గం మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.ఎ.రెహమాన్ తెలిపారు.
No comments:
Post a Comment