న్యూఢిల్లీ, సాక్షి లీగల్ ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ఈ నెల 14వ తేదీన విచారణకు రానుంది. జగన్, ఆయన కుటుంబ సభ్యుల సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొంటూ సీబీఐ సోమవారం కౌంటర్ దాఖలు చేసింది. కాబట్టి జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయరాదని అందులో వాదించింది. తనకు బెయిల్ మంజూరు చేయటానికి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ అఫ్తాబ్‌ఆలం, జస్టిస్ రంజనాదేశాయ్‌లతో కూడిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ కౌంటర్ దాఖలు చేస్తూ.. పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన పలు అంశాలపై ఇంకా తమ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా చాలా పలుకుబడి గలవారని, ఆయనకు విస్తారమైన రాజకీయ, వాణిజ్య వ్యవస్థలు ఉన్నాయని.. కాబట్టి సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీబీఐ తన కౌంటర్‌లో వాదించింది. కాబట్టి జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయరాదని విన్నవించింది. బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీన జరగనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment