సాధారణంగా మీ వద్ద 10 గ్రాముల బంగారంతో కూడిన ఒక చైను ఉంటే దాని విలువ ఎంత అని చెబుతారు? ఇప్పుడు మార్కెట్‌లో బంగారం ధర మండిపోతూ 10 గ్రాముల బంగారం రూ.32 వేలు పలుకుతోంది కాబట్టి అంతే విలువ చెబుతారు కదా. ఆ లెక్కన 2,780 గ్రాముల బంగారం ఉంటే దాని విలువ ఎంత ఉంటుంది. అక్షరాలా రూ.88.96 లక్షలు. కానీ చంద్రబాబు తన భార్య భువనేశ్వరికి ఈ మేరకు ఉన్న బంగారం విలువను ఎంత చూపించారో తెలుసా? కేవలం రూ.26.96 లక్షలు. అదేమంటే కొన్ననాటి ధర అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ అమ్మాలంటే కొన్ననాటి ధరకే అమ్ముతారా? కాగా తన కోడలు బ్రహ్మణికి 2,325 గ్రాముల బంగారు ఆభరాలున్నాయని చంద్రబాబు చెప్పారు. వాటి విలువ రూ.74.24 లక్షలుంటుంది. కానీ ఆయన రూ.9.90 లక్షలుగా మాత్రమే చూపించారు.
ఎందుకంటే... కొన్ననాటి ధర! వెండి విషయంలోనూ.. అంతే. భువనేశ్వరికి 32.7 కిలోల వెండి ఉండగా, బ్రహ్మణికి 97.441 కిలోల వెండి ఉన్నట్టు చంద్రబాబు చెప్పారు. వాటి విలువ కూడా అలాగే చూపించారు. భువనేశ్వరికి ఉన్న 32.7 కిలోల వెండి విలువను రూ.4.57 లక్షలుగా మాత్రమే చూపారు. ఆ వెండి ఇప్పుడు మార్కెట్‌లో రూ.19.62 లక్షలు పలుకుతుంది. అలాగే బ్రహ్మణికి ఉన్న వెండి విలువను రూ.12.37 లక్షలుగా మాత్రమే చూపారు. కానీ మార్కెట్‌లో అది 58.46 లక్షలు పలుకుతుంది. మొత్తం మీద చంద్రబాబు కోడలు బ్రహ్మణి కన్నా ఆయన భార్య భువనేశ్వరికే ఎక్కువ బంగారం ఉందన్న మాట!
రూ.98 కోట్ల నష్టం నుంచి లాభాల్లోకి హెరిటేజ్!
హెరిటే జ్ సంస్థ ఒక్క ఏడాదిలోనే రూ.98 కోట్ల నష్టం నుంచి లాభాల్లోకి వచ్చింది. గత ఏడాది తన ఆస్తుల ప్రకటన సందర్భంగా కుటుంబసభ్యులు నిర్వహించే హెరిటేజ్ సంస్థ నష్టాల్లో ఉందని, 2011 మార్చితో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి అది రూ.98 కోట్ల నష్టంతో నడుస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. గురువారం మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా సంస్థ నష్టాల్లో ఉందని, ఇటీవలి కాలంలో హెరిటేజ్ కంపెనీని ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించటం, ఫ్రెష్‌ల ఏర్పాటుతో లాభాల్లోకి వచ్చిందని చెప్పారు.

No comments:
Post a Comment