ఇప్పటికే వలసలతో ఖాళీ అవుతున్న తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ ఎంసీ లో ఆపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రామకృష్ణాపురం దేప సురేఖ, మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. నిన్ననే వారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖలను రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడుమహేందర్‌రెడ్డికి అందజేసిన విషయం తెలిసిందే.
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఈరోజు దేప సురేఖ, భాస్కర్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. అంతకుముందు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఆర్‌కేపురం, సరూర్‌నగర్, సరూర్‌నగర్ మండలం కందుకూరు, మహేశ్వరం మండలా ల నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. వాసవికాలనీలోని అష్టలక్ష్మీ దేవాలయంలో పూజలు చేసి, ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు.

No comments:
Post a Comment