రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉందని వైఎస్ఆర్ సీపీ రైతువిభాగం రాష్ట్రకన్వీనర్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతు పరిస్థితిని తెలుపుతూ.. రైతు సమస్యల పరిష్కారానికి సీఎంకు నాగిరెడ్డి లేఖ రాశారు. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్ ను నివారించి రైతులను ఆదుకోవాలని లేఖలో తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయారని, రైతాంగం సంక్షోభంలో పడిందని, వర్షాలు లేక విద్యుత్ కొరతతో దిగుబడి తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని లేఖలో ప్రస్తావించారు. ఎరువు కొరతలపై వైఎస్ఆర్ సీపీ ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని నాగిరెడ్డి ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment