YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 9 September 2012

‘విలీనం’కథనాలన్నీ కట్టు కథలే

*వైఎస్సార్ సీపీ మరో పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదు
*విజయమ్మ మాటలను పీటీఐ విలేకరి వక్రీకరించారు.. ఆ విలేకరిపై ఫిర్యాదు చేస్తాం
*లౌకికవాద పార్టీలతోనే పొత్తు ఉంటుందని, అది కూడా భవిష్యత్తులో నిర్ణయిస్తామని ఆమె చెప్పారు
*విలీనం గురించిన ప్రస్తావనే రాలేదు
*కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రశ్నే లేదని జగన్ కూడా గతంలో అనేకసార్లు స్పష్టం చేశారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందంటూ వస్తున్న కథనాలన్నీ కట్టు కథలేనని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, జనక్‌ప్రసాద్‌లు చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పోరాడు తూ వారి ఆదరాభిమానాలు చూరగొంటున్న వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ మరో పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రెండు రోజులపాటు చేపట్టిన ‘‘ఫీజు దీక్ష’’ విజయవంతమవడంతో జడుసుకున్న కొన్ని శక్తులు దానిని తక్కువ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ సీపీ విలీనమవబోతోందంటూ ఒక వర్గం మీడియా ప్రసారం చేస్తున్న పిచ్చి కథనాలు ఆ శక్తుల కుట్రలో భాగమేనని చెప్పారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పీటీఐ వార్తా సంస్థ విలేకరి విజయమ్మ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను పూర్తిగా వక్రీకరించారని తెలిపారు. పార్టీ విధానంపై విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆ విలేకరి వక్రీకరించడం శోచనీయమన్నారు. 

‘‘పీటీఐ విలేకరి విజయమ్మను అడిగిన ప్రశ్నే స్పష్టంగా లేదు. కాంగ్రెస్‌తో విలీనం, పొత్తు అంటూ చిత్ర విచిత్రంగా ప్రశ్నించారు. అయినా విజయమ్మ దీనిపై స్పష్టంగా మాట్లాడారు. బీజేపీలాంటి మతతత్వ పార్టీలతో పొత్తు ఉండదని గతంలో జగన్ చెప్పిన మాటను గుర్తుచేస్తూనే.. లౌకికవాద పార్టీలతోనే పొత్తు ఉంటుందని, అది కూడా భవిష్యత్తులో నిర్ణయిస్తామని సమాధానమిచ్చారు. ఇందులో విలీనం గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు. ఒకవేళ విలీనమనే మాటే వస్తే మధ్యలో బీజేపీ గురించి ప్రస్తావనే రాదుకదా’’ అని గట్టు అన్నారు. పీటీఐవంటి సంస్థ నుంచి ఇటువంటి వక్రీకరణ కథనం రావడం దురదృష్టకరమన్నారు. తప్పుడు కథనం రాసిన విలేకరిపై చర్య తీసుకోవాలని ఆ వార్తా సంస్థకు ఫిర్యాదు చేస్తామని గట్టు చెప్పారు. మొదటి నుంచీ ఒక వర్గం మీడియా తమ పార్టీపై కట్టుకథలు అల్లుతోందన్నారు. 

‘‘యూ ట్యూబ్’’లో ఉంచిన ఒక కట్టుకథను పట్టుకొని అదే పనిగా ప్రసారం చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘విలేకరి ఇంటర్వ్యూ చేయడం, దాన్నే ఒక చానల్ ప్రసారం చేయడం, ఆ వెంటనే దానిని పట్టుకొని టీడీపీ చర్చకు తెరలేపడాన్ని బట్టి చూస్తే ఈ ముగ్గురూ కలిసి కుట్ర చేసినట్టుగా ఉందని గట్టు సందేహం వ్యక్తంచేశారు. ఒక చానల్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి వైఎస్సార్ కాంగ్రెస్ వణికిపోదని చెప్పారు. తమ పార్టీపై ఇప్పటికి కొన్ని వందలసార్లు దుష్ర్పచారం చేసినా ప్రజలు ఏనాడూ నమ్మలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు స్పష్టంగా చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, ప్రజారాజ్యం పార్టీలాగా తాము ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలో జగన్ విస్పష్టంగా చెప్పారని అన్నారు. అయినా ఒక వర్గం మీడియా తమ పార్టీపై తప్పుడు కథనాలతో దుష్ర్పచారానికి పాల్పడుతోందని చెప్పారు. తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లడం జరగని పని అని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని తెలిపారు. ఎన్నికల అనంతరం అవసరమైతే ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని మాత్రమే జగన్ ముందు నుంచీ చెబుతున్నారని అన్నారు. అదికూడా బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని చెప్పారని తెలిపారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం శరద్ పవార్‌తోనైనా, ములాయంతోనైనా, మమతతోనైనా చివరకు కాంగ్రెస్ పార్టీతో నైనా పొత్తు తమకు అంగీకారమేనని జగన్ చెప్పారని తెలిపారు.

బాబును ఎన్ని జాకీలతో ఎత్తినాప్రయోజనం ఉండదు: జనక్ ప్రసాద్

ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబును ఎల్లో మీడియా ఎన్ని జాకీలతో ఎత్తినా ప్రయోజనం ఉండదని జనక్‌ప్రసాద్ ఎద్దేవా చేశారు. మీరు ఊడిగం చేసేపార్టీని ఎంతైనా ఆకాశానికి ఎత్తుకోండి కానీ, మరో పార్టీని వెంటాడి వేటాడి తరుముకుంటా రావడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఒక పార్టీకి ఊడిగం చేస్తూ, మరొక పార్టీపై అసత్య ప్రచారం చేయడమేనా దమ్మున్న చానల్ విధానం అని నిలదీశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!