YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 26 September 2012

రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా విజయవంతం

హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసి బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మహాధర్నా విజయవంతం అయింది. అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ధరల పెరుగుదలకు నిరసన తెలిపారు. 

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణారంగారావు, జిల్లా ఇన్‌ఛార్జ్ పెన్మత్స సాంబశివరాజు, జిల్లా పరిశీలకుడు రవిబాబు, విజయ్ పాల్గొనర్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

ఏలూరు కలెక్టరేట్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ సర్‌ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్సీ శేషుబాబులు మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ ఉన్నతకాలం ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం మోపలేదని గుర్తు చేశారు. ఆయన మరణం తర్వాత ప్రజలపై వరస భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేరోజులు దగ్గరపడ్డాయని శాపనార్ధాలు పెట్టారు. 

నిజామాబాద్ లో రైల్వేకమాన్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అనంతపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, తోపుదుర్తి కవిత, పా్టీ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ జిల్లాలోని రొద్దంలో మండల రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

source: sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!