హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్ని విధాలా రాజకీయ పలుకుబడి కోల్పోయి అప్రతిష్ట పాలైన టీడీపీ అధినేత చంద్రబాబు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, అందుకే ఆయన కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... తన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు... మళ్లీ బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ అని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.
‘వస్తున్నా...మీ కోసం’ అని పేరు పెట్టుకుని అసలు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలో డైలమాలో పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అన్యాయంగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించారని... చివరకు న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. తానే పెద్ద మాదిగ అనే విధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబును మాదిగలు ఎంత మాత్రం నమ్మరని నల్లా సూర్యప్రకాష్ చెప్పారు. తొమ్మిదేళ్లలో మాదిగలకు ఆయన ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. నమ్మకానికి వైఎస్ మారుపేరని... నమ్మక ద్రోహానికి బాబు పెట్టింది పేరని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
source: sakshi

No comments:
Post a Comment