వాన్ పిక్ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు రూ.25వేలు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తును కోర్టుకు సమర్పించారు. ఆయన మళ్లీ అక్టోబర్ 9న విచారణకు హాజరు కావల్సి ఉంది. కాగా ఈకేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారికి న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. మిగతావారంతా అదే రోజు కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=457172&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=457172&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment