వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌కు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఆయన గురువారం తన స్వగ్రామం నుంచి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అధికార, విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే అన్యాయంగా నిర్బంధించారని మేకపాటి అన్నారు. అధికార, విపక్షాలు కుమ్మక్కై..పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎవరినీ నమ్మరనీ... జగన్ నాయకత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నారని మేకపాటి స్పష్టం చేశారు.

No comments:
Post a Comment