నిన్నటి దినాన బెయిల్ వస్తుందని ఎంతో ఎదురుచూశాము. కానీ సీబీఐ మళ్ళీ వంకరబుద్ధి చూపించింది. సీబీఐ తరపున రావలసిన లాయర్ రాలేదు. అందుకని ఒక వారం వాయిదా పడింది. మొదట మేమందరం నిరుత్సాహపడినా తరువాత నాకు మా మామగారు ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకువచ్చాయి... ‘ధైర్యంగా వుండాలి - దేనినైనా మనం ఎదుర్కోవడానికి వెనకాడకూడదు, భయపడకూడదు’. ఆయన జగన్‌కు చెప్పేవారు - ‘‘స్థితప్రజ్ఞత ఉండాలి జగన్. మంచి జరిగితే మరీ పొంగిపోవడం, అనుకున్నట్టు జరగకపోతే మరీ కృంగిపోవడం ఉండకూడదు’’ అని! జగన్ వాళ్ళ నాన్న మాటలు వినీ వినీ స్థితప్రజ్ఞత ఒంట బట్టించుకున్నాడు. దేనికీ అదరడూ బెదరడు. నాకు ఈ సీబీఐ, కాంగ్రెస్, టీడీపి వాళ్ళని చూస్తే కోపం కాదు, జాలి వేస్తుంది. జైల్‌లో పెట్టినా కూడా కోపం, ద్వేషం, దిగులు, భయం
ఎరగని స్వేచ్ఛాజీవి జగన్. కానీ బయటవున్న వీళ్లు కుళ్లు, కుతంత్రాలకు, పగ, ద్వేషం, ఈర్ష్యలకు బందీలు. నిజంగా జగన్‌కాదు జైల్‌లో ఉండేది... జగన్ ఊహను కూడా చూసి భయపడే ఈ సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో గ్యాంగ్ నిజమైన ఖైదీలు.
- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్
అప్పుడేమి చేస్తున్నారు వీళ్లంతా....?
పాఠకుల స్పందన
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ అభిమానులే. కాని రాజశేఖర్‌రెడ్డి చనిపోయి జగన్‌కు ఆ పార్టీ భవిష్యత్తు లేకుండా చెయ్యాలనుకొంటున్నదని తెలిసేంతవరకు కాంగ్రెస్ వేరని, రాజశేఖరరెడ్డి వేరని తెలియలేదు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌ను ముఖ్యమంత్రిని చెయ్యాలని మీడియాలో వస్తుంటే మా ఆశలన్నీ మళ్ళీ చిగురించాయి.
అదే సమయంలో యాధృచ్ఛికంగా జగన్‌ను కడపలో ఓ షాప్ ఓపెనింగ్‌లో కలవడం జరిగింది. తనను ఓసారి చూడాలని నిలబడి వుంటే, తనే మా దగ్గరికి వచ్చి ‘ఏమ్మా బాగున్నారా... ఏదైనా అవసరం వుండి వచ్చారా? ఎవరూ బాధపడొద్దు. దేవుడున్నాడు. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్తుంటే... ఆయన్ని మేము ఓదార్చాల్సిన సమయంలో మమ్మల్ని ఓదారుస్తుంటే మాటలు రాక నిలబడ్డాను. అప్పుడే తెలిసింది ఓ లీడర్‌కు కావలసిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని, జగన్ ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఖచ్చితంగా బాగుంటుందని. తర్వాత జగనన్న ఓదార్పు యాత్ర ప్రారంభించడం, అది అధిష్టానానికి ఇష్టం లేకపోవడం... ఎన్నో సమస్యలు సృష్టించడం తెలిసిందే. తర్వాత అధిష్టానాన్ని ఒప్పించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఆ పార్టీలో ఇమడలేక తనే బయటికి వచ్చెయ్యడం జరిగింది.
అప్పటి నుంచి సిబిఐ ఈడీ ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఒక మాట అడగాలనుకుంటున్నాను. నిజంగా రాజశేఖర్‌రెడ్డి అంత అవినీతికి పాల్పడివుంటే, జగన్ దానివల్ల అంత లబ్ధి పొంది వుంటే, అది ఒక్కరోజులో, ఒకరి వల్ల జరిగుండదు కదా. అప్పుడు ఏమి చేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు వీళ్లని ఆడిస్తున్న ఢిల్లీ పెద్దలకు వైయస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన పాలనలోని అవినీతి కనబడలేదా? ఇప్పుడు ఆయన ప్రాణాలతో లేరని, మాట్లాడలేరని తెలిసి జగన్‌ను ఏమి చెయ్యాలనుకుంటున్నారు? ఒక్కమాట మాత్రం చెప్పగలను. జగన్ తప్పు చేయలేదన్నది స్పష్టం. జగన్ తప్పు చేయాలనుకుంటే చంద్రబాబులా బినామీల పేరుతో సంస్థలు స్థాపించేవారు. ముందు ఆ 26 జీవోలు సక్రమమో, అక్రమమో తేల్చండి. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే రద్దు చేయండి. అంతేకాని ద్వేషంతో జగన్‌ను అణగదొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలే వారికి బుద్ధి చెబుతారు.
రాష్ట్రంలో తొంభై శాతం జనం జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నారు. ఎంతోమంది తల్లులు తన బిడ్డే అనుకుని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఎంతో మంది తల్లుల ఆశీర్వాదంతో జగన్ నిర్దోషిగా బయటికి వస్తాడు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో జగన్ ఖచ్చితంగా సిఎం అవుతారు. మనస్ఫూర్తిగా ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుకి కుళ్ళు, కుతంత్రాలు కొట్టుకునిపోతాయి. అంతిమ విజయం జగనన్నదే అవుతుంది.
- రక్కాసి శ్రీవాణి
జిఎంసి బ్యాక్‌సైడ్, రాజంపేట

No comments:
Post a Comment