నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్దమయ్యారు. నెల్లూరులోని తన నివాసం నుంచి నరసింహ స్వామి కొండ వరకు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. పార్టీ నాయకులతో కలిసి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించనున్నారు.
పాదయాత్రలో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏర్పాట్లను ఎంపీ మేకపాటి స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
source:sakshi

No comments:
Post a Comment