YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 25 September 2012

అట్టర్‌ఫ్లాప్ అల్లుడు!

ఇక్కడ రాష్ట్రంల సర్వేల మీద సర్వేలు పోటీపడతా వుంటే సెంద్రబాబు గుండెలు బేజారవుతున్నాయి. కస్టపడి జగన్ బాబును జైలుకు పంపించినా - నా మీదొచ్చిన కేసుల్నుండి చట్టాన్ని మాయజేసినా - నేను నీతిమంతుణ్ణని అజారే పుటో బెట్టుకొని వూరేగినా ఇన్ని జేసినా ఈ జనం నన్ను నమ్మలే - బై ఎలచ్చన్ల తుక్కుతుక్కు కింద గొట్టేసినారు. పోనీ అయిబోయినయేగందా అనుకుంటే వచ్చే ఎలచ్చన్ల గురించి ఈ సర్వేలొకటి. అదేదో నీలసన సర్వే అంట జగను బాబుకు ఇరవయ్యేడు పార్లమెంటు సీట్లొస్తాయని జెప్పేసినారు. 

అంతటితో వూర్కుంటే బోలా - ఆ దారిల యన్డీటీవీ సర్వే అంట, ఇంకా ఇండియా టుడే అంట, డక్కన్ హెరాల్డంట. ఇయన్నీ జగనే సీయమ్మని రాస్తావుంటే నా పాణం వూర్కుంటాదా. కంటినిండా నిద్దరబోయి ఎన్ని దినాలైనాది. ఇక తిండి మాట జెప్ప పన్లే. అని అల్లుడు నిండా దుఃఖంల మునిగినాడు. 
పార్టీ మీటింగుల్ల వచ్చే ఎలచ్చన్ల మనమే గెలుత్తామని చెప్పి ఆళ్లని బోనీకుండా నానా తంటాలు పడతావుంటే ఇప్పుడీ సర్వేలొచ్చి యములోళ్లా యెంటబడతా వున్నాయి - అని రెండు దినాలు తెగబాదపడిపోయి ఈ మనియాదనుండి బైటపడాలంటే డిల్లీబోవటమే దిక్కనుకున్నాడు.

బి.సి.కార్డు పట్టుకుని ప్లయిటెక్కేసినాడు. అక్కడ వూరున్నా పేరులోనోళ్లని, పేరున్నా వూరులేనోళ్లని, రాజకీయాలొదిలేసినాళ్లను చిన్నచితకా నాయకుల్ని గలిసి తన పేపర్ల బొమ్మేయించుకొనినాడు. ఆ నాయకులొకటి జెప్తే మరోటి రాయించేసినాడు - అక్కడితో కథాగిపోలే -
ఆలోచించి ఆలోచించి ములాయంసింగును కల్సినాడు. పాత పరిచయాలన్నిటిని వడబోసి అన్నా! నువ్వు నాకంటె సీనియర్‌విగందా. మా మావున్నప్పుడు మీరంతా తెగదోస్తీ జేసినారే - నేను ఆయన అల్లుడ్నే - నిండా కష్టాల్లో మునిగినానబ్బా - నువ్వుగాక నాగింక దిక్కెవ్వరు. ఆ ఇష్ణువు గాపాడినట్టు నీ సైకిలు చక్రం అడ్డం వేసి ఇప్పుడున్న నన్ను గాపాడాల అని రెండు కాళ్లు పట్టేసినాడు -

పెద్దాయనకు కొంచెం జాలొచ్చి - ఏడవమాకబ్బా - ఇప్పుడు నేజేసే సాయం ఏముంటాది - మా ఉత్తరప్రదేశ్ అదికారమైతే ఇవ్వలేను - అది నాకొడుకు కస్టపడి సంపాదించినాడు - ఇచ్చే రైటు నాకు లేదు - మరేంగావాల అడుగు అన్నాడు.

ఏంలేదన్నా - నీ సైకిలిచ్చేసేయ్ - చాలు - ఎందుకంటే నీదీ సయికిలే - నాదీ సయికిలే - అందుకే మనది జనమజనమల బందం - నాసయికిలుకు నిండా రిపేరొచ్చినాదన్నా - అందులో ఏ ఒక్క బాగమూ పనిచేయటల్లా - ఇప్పుడు నా కొడుక్కు పార్టీ ఒప్పజెప్దామంటే రిపేరొచ్చిన సయికిలు నేనేం జేసుకోవాల నాయనా అని యాస్టపడతావుండాడు - ఇప్పుడు జెప్పన్నా - నువ్వు నీ కొడుక్కు జేసినట్టు నా కొడుక్కు గూడా నేను జేయాలిగందా - అందుకే కొన్నాల్లు నీ సయికిలిత్తే అదికారం వచ్చాక మళ్లీ జాగర్తగా ఇచ్చేయనూ - అని రెండు సేతులు జోడించినాడు.

దాంతో ములాయంసింగుకు ఎక్కడలేని కోపమొచ్చేసినాది. చెడాబడా తిట్టేసినాడు - ఆ రోజు నీ మావను యెన్నుపోటు బొడిచి ఆయన సయికిలు లాగేసినావు - ఇప్పుడు నీ కళ్లు పచ్చగా వున్న నా సయికిలు మీద పడ్డాయా - నువ్వెక్కడుంటే అక్కడ మటాష్ - అమ్మో ఇంకాసేపుంటే నన్ను కూడా కత్తితో బొడిచి నా సయికిలెత్తుకు పోతావ్ - ఇక నేనుండా - అని రివ్వున సయికిలెక్కి తుర్రుమన్నాడు. అప్పుడు అల్లుని జూడాలె. ఆయన ముకం మన్నేసినట్టు నల్లబడిపోయినాది.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=49715&Categoryid=1&subcatid=18 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!