తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా నుంచి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణకు అనుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే ప్రధానికి లేఖ రాసిన ఇరవై గంటలకే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె యువ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు.పార్టీ కన్నా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారని, ఆ ప్రాంతం వ్యక్తి అయి ఉండి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పార్టీ తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు.చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు రెండువేల తొమ్మిది నుంచి తప్పులే చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మార్చ్ పేరుతో సీమాంద్రులపై దాడికి తెలంగాణవాదులు ప్రయత్నిస్తుంటే, దానికి తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు.ఇంతకాలం చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ ఎమ్మెల్యేలు నాగం జనార్దనరెడ్డి,జోగు రామన్న,పోచారం శ్రీనివాసరెడ్డి, గంపా గోవర్ధన్ లు పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలలో పోటీచేయగా, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి వంటివారు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇప్పుడు సీమాంధ్ర నుంచి ఈ సమస్య వస్తోంది. పైగా పాదయాత్రకు చిత్తూరు జిల్లా వస్తే నిరసన తెలుపుతామని కూడా ప్రవీణ్ హెచ్చరిస్తున్నారు.
source: kommineni
source: kommineni
No comments:
Post a Comment