వాన్ పిక్ భూముల కేటాయింపుతో జగన్ కు సంబంధం లేదని సిబిఐ న్యాయవాది హైకోర్టు వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం సంచలనంగా మారింది.ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్ కు భూ కేటాయింపులతో సంబందం లేనప్పుడు ఆయన కంపెనీలలో పెట్టుబడులలో తప్పేమిటన్న సందేహం సహజంగానే వస్తుంది.దీనిపై హైకోర్టు న్యాయమూర్తి కూడా తనకు కూడా కొన్ని సందేహాలు వస్తున్నట్లు వ్యాఖ్యానించడం విశేషంగా కనిపిస్తుంది.ఇంతవరకు వాన్ పిక్ భూముల కేటాయింపునకు, జగన్ కంపెనీలలో పెట్టుబడులకు సంబందం ఉందని సిబిఐ వాదిస్తూ వచ్చింది. అయితే సిబిఐ వాదన ప్రకారం జగన్ పేరు ఇందులో ప్రస్తావన తెచ్చినా, అసలు అభియోగం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై మోపాలన్నది వారి అభిప్రాయం కావచ్చు. ఆయన ఎటూ లేరు కనుక ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ను ప్రధాన నిందితుడిగా చేశారు. అయితే తండ్రి చేసిన తప్పులకు కొడుకు బాధ్యత ఎలా వహిస్తారన్న ప్రశ్న వస్తుంది. అంతేకాక అసలు వాన్ పిక్ ప్రాజెక్టు సంబందించి ఏడెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేయడం పెద్ద తప్పన్నట్లుగా సిబిఐ వాదిస్తోంది.ఒకపక్క మంత్రి దర్మాన ప్రసాదరావు అన్నిటికి క్యాబినెట్ ఆమోదం ఉందని చెబుతోంటే, సిబిఐ అందుకు భిన్నంగా వాదిస్తోంది. అలాంటప్పుడు ధర్మానను అరెస్టు చేయడానికి సిబిఐ ఎందుకు ప్రయత్నం చేయలేదో అర్దం కాదు.ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాదన వినడానికి సిబిఐ కూడా ఎందుకు ప్రయత్నం చేయలేదో తెలియదు. రాజకీయ కేసుగా మారిన ఈ వ్యవహారంలో సిబిఐ అప్రతిష్టను తెచ్చుకునేలా ఉంది.దీనివల్ల రాష్ట్రానికి కూడా నష్టం జరగవచ్చు.పెట్టుబడులు పెట్టేవారు వెనుకంజ వేయవచ్చు. ఒకవేళ నిజంగానే నిబందనలకు విరుద్దంగా భూ కేటాయింపులు జరిగితే, దానిని రద్దు చేసి భూమిని తీసుకోవచ్చు కదా. అప్పుడు నష్టపోయేది పెట్టుబడిదారుడే కదా. దానిని వదలిపెట్టి ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేయడం, బెయిల్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించడం.. ఎంతకాలం సిబిఐ ఈ రకంగా చేస్తుందో తెలియదు.
source: kommineni
source: kommineni
No comments:
Post a Comment