అసలు మా మామగారు చేసిన తప్పేంటి?
మన రాష్ర్టం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని తాపత్రయపడటమే తప్పా? రాష్ట్రంలో పూరిగుడిసె ఉండకూడదు అనుకోవడం తప్పా? పేదవాళ్లు బాగా చదువుకోవాలని, మంచి వైద్యం చేయించుకోవాలని, గుజరాత్.. తమిళనాడు.. మహరాష్ట్రలను తలదన్నే వృద్ధిరేటు ఉండాలని కోరుకోవడం, దాని కోసం రేపు లేదన్నట్టుగా అవిశ్రాంతంగా పనిచేయడమేనా ఆయన చేసిన తప్పు?
మొన్న 14వ తారీఖున జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో హియరింగ్‌కు వచ్చింది. అది వచ్చే నాటికి జగన్ జైలులో ఉండబట్టి 110 రోజులు. సిబిఐ వాళ్లు వేసిన కౌంటర్ ఫైల్ చూశాను. వాళ్లిచ్చిన అన్యాయమైన లీకులు చూశాను. వాళ్లకు వంతపాడిన పత్రికలను, టివి చానెల్స్‌ను చూశాను. వాళ్ల సహ కుట్రదారులైన రాజకీయనాయకుల మాటలు విన్నాను. నాకు అనిపించింది -వీళ్లకు ఎందుకు ఇంత కక్ష, ఇంత పగ అని. ఒక మనిషిని ఎదుర్కొనడానికి ఇంత కథ, స్క్రీన్ ప్లే, డెరైక్షన్ అవసరమా? ఇంత ప్లానింగ్‌తో... ఇంతగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంత తెలివిగా చేస్తున్నామనుకొని ఒకరి భుజాలు మరొకరు చరుచుకుంటూ ఉండటం అవసరమా?
కాని మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడట. మన తెలివితేటలను మూర్ఖత్వంగా మార్చగల దేవుడు చూస్తున్నాడన్న విషయం మర్చిపోయారు. ఆరోజు మా పిల్లలు భోరున ఏడ్చారు... ‘ఇంకెన్ని రోజులు అమ్మా... ఎందుకింత అన్యాయంగా మనలను ఇబ్బంది పెడుతున్నారు’ అని ఏడ్చారు. పిల్లలు ఏడ్చారని మేము చెప్పినప్పుడు మామూలుగా ఎంతో నిబ్బరంగా ఉండే జగన్ చాలా కలత చెందాడు. పిల్లలకు చెప్పు ధైర్యంగా ఉండమని... దేవుని దయ వలన నాన్న ఆశీర్వాదంతో త్వరగా వస్తానని చెప్పు అన్నాడు. మేము ఏం చేశామని మాకీ శిక్ష?
జగన్ ఒక ఎంపీగా ఉన్నాడా... ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడా... ఒక మంత్రిగా ఉన్నాడా... ఒక ఆఫీసర్‌గా ఉన్నాడా... అసలు మా మామగారు చేసిన తప్పేంటి? మన రాష్ర్టం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని తాపత్రయపడటమే తప్పా? రాష్ట్రంలో పూరిగుడిసె ఉండకూడదు అనుకోవడం తప్పా? పేదవాళ్లు బాగా చదువుకోవాలని, మంచి వైద్యం చేయించుకోవాలని, గుజరాత్.. తమిళనాడు.. మహరాష్ట్రలను తలదన్నే వృద్ధిరేటు ఉండాలని కోరుకోవడం, దాని కోసం రేపు లేదన్నట్టుగా అవిశ్రాంతంగా పనిచేయడమేనా ఆయన చేసిన తప్పు? ఆయన ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నది వాస్తవం కాదా? ఆయన ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా అందరూ సంతృప్తిగా ఉన్నది నిజం కాదా? ఆయన అహర్నిశలు శ్రమించినందుకా ఆయన కుటుంబానికి ఈ క్షోభ? ఈ శిక్ష?
న్యాయంగా అయితే సిబిఐ ‘చట్టప్రకారం వాళ్లకి బెయిలు రావలసి ఉంటే, వాళ్ల హక్కులకు మేము అడ్డుతగలం’ అని చెప్పవలసింది పోయి, అంతగా పట్టుపట్టి ఎట్టి పరిస్థితులలోనూ న్యాయం జరగకూడదు అని పంతంతో వ్యవహరిస్తూ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు - ఇది నిష్పక్షపాతంగా కాదు, ముమ్మాటికీ ఏకపక్షంగా, అన్యాయంగా, అక్రమంగా జరుగుతున్న విచారణ - అని.
కాని మన దేశంలో న్యాయం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తున్నదనే నమ్మకం నాకుంది. తప్పక జగన్‌కు న్యాయం జరుగుతుంది. బెయిల్ వస్తుంది.
నాకు భయమేసినప్పుడల్లా దేవుడిని, మా మామగారిని తలుచుకుంటాను నేను. ఆయన ఎంతోమంది ఆడబిడ్డలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. కష్టాలలో వాళ్లను ఆదుకున్నారు. ఆయన వాళ్లను ఆదుకున్నట్టు దేవుడు నన్ను, మా అత్తను ఆదుకుంటాడు. ఆయన చేసిన మంచి ఊరికే పోదు. అది తప్పకుండా మాకు దీవెన ఇస్తుంది. దేవుడి దయవలన జగన్ తప్పకుండా త్వరలో బయటికి వస్తాడు. మామను ప్రేమించే ప్రతి గుండె జగన్‌ను ఆదరిస్తుంది.
జగన్ ఆరోజు నల్లకాలువలో అన్నాడు - నాన్న నాకొక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు- అని. నిజమే... అధికారంలో ఉండేవాళ్లు, కుళ్లు కుట్రలు మనసులో ఉంచుకొని పైకి సమాజంలో నీతి మాటలు పలుకుతూ పెద్ద మనుషుల్లా చలామణి అయ్యేవాళ్లు మాకు విరోధులుగా ఉండవచ్చు. గులాంనబీ ఆజాద్‌గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా - ‘జగన్ మా పార్టీలో ఉండి ఉంటే తనను కేంద్ర మంత్రిని చేసేవాళ్లం, ఆ తర్వాత తనను ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం’ అన్నారు. ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా గుండెను పిండుతున్నంత బాధ అనిపిస్తుంది. అంటే తను వాళ్ల మాటలు వినలేదు కాబట్టి, ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు కాబట్టి, అందరూ కలిసి ఇంత కుట్రచేసి అన్యాయంగా జైలుకు పంపించారు. వీళ్లు ఈ సమాజంలో పెద్ద మనుషులు!
కాని రాష్ట్రంలోని ప్రతి పేద అవ్వ - తాత, ప్రతి అన్న - చెల్లి, ప్రతి తమ్ముడు - అక్క తోడు ఉన్నంత వరకు, పైనుండి దేవుడి చల్లని దయ, మామగారి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ పెద్దమనుషుల కుట్రలు, కుతంత్రాలు దూదిపింజల్లా తేలిపోతాయి. వానలా వెలిసిపోతాయి. జగన్ త్వరలో మనందరి మధ్యా ఉంటాడు.
మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=49757&Categoryid=11&subcatid=22

No comments:
Post a Comment