జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ ఒకటవ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ వైద్య విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన రూపొందించిన పోస్టర్‌ను మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీజీసీ సభ్యులు ఎం.వి.మైసూరారెడ్డి, సీఈసీ సభ్యులు అంబటి రాంబాబు, కె.శివకుమార్, వైద్యవిభాగం రాష్ట్ర కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు, ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పి.ఎన్.వి.ప్రసాద్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రోజర్‌రొయిస్, డాక్టర్ దత్తా శాంతివర్దన్, డాక్టర్లు ఎ.ఉదయభాస్కర్, శివరాంనాయక్, వై.అశోక్, జి.ఎస్.కె.రెడ్డిలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment