నెల్లూరు: చంద్రబాబు చేయబోయేది పాదయాత్ర కాదు శవయాత్ర అని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అధికార పీఠం కోసమే పాదయాత్ర పేరుతో కొత్త రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం నమ్మే పరిస్థితి లేదని ప్రసన్న కుమార్ అన్నారు. అధికారంలో ఉన్నంత సేపు బిల్‌క్లింటన్, బిల్‌గేట్స్ అంటూ హైలెవల్లో ఆలోచించారే తప్ప పేదల కోసం ఎప్పుడు ఆలోచించలేదని ఆయన మండిపడ్డారు. జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment