వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఒక న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఒక న్యాయమా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సీబీఐ తీరుపై ఆమె మండిపడ్డారు. ధర్మాన బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. జగన్ బెయిల్ విచారణకొచ్చిన ప్రతిసారి సీబీఐ వాదిస్తోందని విమర్శించారు. ధర్మాన బెయిల్ విషయంలో సీబీఐ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. సీబీఐ కక్షపూరిత వైఖరి స్పష్టంగా బయటపడిందన్నారు. ఒకే కేసులో మంత్రులు, అధికారులు బయట ఉండొచ్చు, జగన్ ఒక్కరే జైల్లో ఉండాలా? అని ఆమె అడిగారు. జగన్ ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశారని కోర్టులో సీబీఐ నిరూపించగలిగిందా? అని ప్రశ్నించారు. జగన్ కు బెయిల్ రాకుండా కుట్ర జరుగుతోందన్నారు. జీఓలు జారీ చేసిన మంత్రులు తమపై వచ్చినవి ఆరోపణలు అంటున్నారు. అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు బెయిల్ రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సిబిఐ వాదనల్లో నిజంలేదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment