తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తిరుగుబాటు చేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లావాడే కావడం విశేషం. అది కూడా చంద్రబాబునాయుడు పక్క నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న ఎన్.అమరనాధ రెడ్డి కావడం ప్రత్యేకతగా తీసుకోవాలి.ఇప్పటికే తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించి, తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.అదే బాట అమరనాధ్ రెడ్డి కూడా తాను సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల పార్టీ దెబ్బతింటోందని అన్నారు.అమరనాధ్ రెడ్డి గతంలో పుంగనూరుకు, ఆ తర్వాత పలమనేరుకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఈయన తండ్రి కూడా రామకృష్ణారెడ్డి కూడా టిడిపి పక్షాన ఎమ్మెల్యే, ఎమ్.పిగా బాధ్యతలు నిర్వహించి దివంగతులయ్యారు. ప్రవీణ్ కాని, అమరనాద్ రెడ్డి కాని రాజకీయ కుటుంబాలకు చెందినవారే కావడం విశేషం. వీరే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇంకెవరైనా తిరుగుబాటు చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
source: kommineni
source: kommineni
No comments:
Post a Comment