వైఎస్సార్ మరణించిన నాటి నుంచి ప్రతి పక్షానికీ జగనే ప్రతిపక్షం
అధికార కాంగ్రెస్‌తో కలిసిమెలిసి పనిచేస్తున్న తెలుగుదేశం
జగన్‌పై కేసు వేయటం నుంచి అరెస్టు వరకు అంతా ఉమ్మడి స్క్రిప్టే
డాక్యుమెంట్లు ఇచ్చిపుచ్చుకుని మరీ కేసులు వేసిన కాంగ్రెస్- టీడీపీ
తీర్పునకు రెండ్రోజుల ముందే ఢిల్లీలో చిదంబరంతో బాబు రహస్య భేటీ
ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేయించటానికీ చక్రం తిప్పిన బాబు
ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకూ అన్నిచోట్లా కుమ్మక్కే
ఇన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 15 స్థానాలు, టీడీపీకి సున్నా
ప్రతి సర్వేలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కే పట్టంగడుతున్న ప్రజలు
ముఖ్యమంత్రిగా ఎవరుండాలి? అన్న సర్వేల్లో జగన్‌కే అగ్రస్థానం
దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా జగన్‌ను నిలువరించాలంటూ కుట్రలు
పెపైచ్చు కాంగ్రెస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కయిందంటూ నిందలు
బాబు దారిలోనే ప్రతి అంశాన్నీ వక్రీకరించి రాస్తున్న ఎల్లో మీడియా
ఆఖరికి సీబీఐ లాయరును కేంద్రం మార్చినా కూడా వక్ర రాతలు
జగన్ బెయిలుపై విచారణ జరిగే ప్రతిసారీ ఏదో ఒక కుట్ర
కుమ్మక్కు కావటమంటే ఏంటో ఇప్పటికే నారా చంద్రబాబునాయుడికి అనుభవంలోకి వచ్చింది. రాజకీయాల్లో కుమ్మక్కయితే ఫలితాలెలా ఉంటాయో కూడా తెలిసొచ్చింది. చివరికి ఈ కుమ్మక్కు కుట్రలతో రాష్ట్రంలో టీడీపీ చిరునామా గల్లంతవటం తథ్యమని కూడా ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఇపుడాయన కొత్త పల్లవి అందుకున్నారు. తమ కుమ్మక్కు గురించి ఇక ఎంతచెప్పినా జనం నమ్మని స్థితికి చేరుకున్నారని గ్రహించి... దాన్ని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌కు అంటగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆఖరికి ఢిల్లీలో సీబీఐకి ప్రాతినిధ్యం వహించే లాయరును కేంద్ర ప్రభుత్వం మార్చినా కూడా అది కాంగ్రెస్‌తో జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కవటం వల్లేననే దిగజారుడు ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు ‘మనసులో మాట’ను గ్రహించటంలో ఎప్పుడూ ముందుండే ఎల్లో మీడియా... ప్రతి అంశాన్నీ ఈ కుట్రలో భాగంగా ఎలా మలచాలా? అన్న ఆలోచనలే చేస్తోంది తప్ప వాస్తవాల్ని చెప్పే ప్రయత్నాలు ఎన్నడో మానేసింది. అసలు కుమ్మక్కు ఎవరిది? కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎవరికుంది? కుమ్మక్కు కుట్రల్లో ఏది నిజం?
2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ దుర్ఘటనలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో వివిధ కార ణాలతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. కొత్త సీట్లు రావటం మాట అటుంచి తెలుగుదేశానికి ఉన్న సీట్లూ పోయాయి. గెలుపోటముల సంగతి పక్కనబెడితే డిపాజిట్లు సైతం గల్లంతయ్యాయి. ఆ పార్టీకిపుడు చరిత్రలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ వేధింపుల్ని తట్టుకోలేక అధిష్టానాన్ని ఎదిరించి వైఎస్సార్ వారసుడిగా ప్రజల మధ్యకు వచ్చిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఆయన సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఆవిర్భవించింది. మరోవైపు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒంటిచేత్తో రెండోసారి అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఆయన మరణించాక అధిష్టానం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. వైఎస్సార్‌ను విమర్శించటమే అర్హతగా పదవులు పొందిన వాళ్లంతా కలిసి ఆ పార్టీని ప్రజలకు దూరం చేసే ప్రయత్నాల్లో విజయం సాధించారనే చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఉంటుందా? లేక నానాటికీ బలపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవటానికి చేతులు కలపాల్సిన అవసరం తెలుగుదేశం- కాంగ్రెస్‌లకు ఉంటుందా? సమాధాన ం తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అది వాస్తవరూపం దాల్చింది కూడా. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలువరించటం కష్టం కనక ఇతరత్రా మార్గాల్లో అడ్డుకోవాలని భావించిన ఈ రెండు పార్టీలూ చేతులు కలిపి ఏం చేశాయన్నది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనిదేమీ కాదు. ఆ దృష్టాంతాల సమాహారం ఇదిగో...
కేసు వేయటంతో మొదలు...
2009 సెప్టెంబర్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక దాన్ని తట్టుకోలేక ఈ రాష్ట్రంలో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. వారందరి కుటుంబాలనూ ఓదార్చటానికి వస్తానని మాట ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి... ‘ఓదార్పు యాత్ర’ మొదలుపెట్టారు. యాత్రలో జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టడాన్ని సహించలేని కాంగ్రెస్ అధిష్టానం దాన్ని నిలిపేయమంటూ హుకుం జారీ చేయటం, నిలిపేయకపోవటంతో అడ్డంకులు సృష్టించటం, అవి నచ్చని జగన్ అధిష్టానాన్ని ధిక్కరించి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టడం తెలియనివేమీ కావు. దాంతో జగన్‌ను ఎలాగైనా నిలువరించాలన్న అధిష్టానం కుట్రలో భాగంగా శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. దానికి ఆధారాలంటూ తరవాత పలు పత్రాలూ జత చేశారు. ఆ తరవాత జరిగిందే అసలు చిత్రం. తెలుగుదేశం నేతలు ఎర్రన్నాయుడు, బెరైడ్డి రాజశేఖర రెడ్డి, యనమల కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. ఇక్కడ కుమ్మక్కుకు అసలైన నిదర్శనమేంటంటే... శంక ర్రావు వేసిన పత్రాలనే అటూ ఇటూ మార్చి తెలుగుదేశం నేతలు కూడా వేయటం. పిచ్చి గీతలతో సహా కొన్ని పేపర్లు రెండు పిటిషన్లలోనూ కనిపించటం. ఇంతకన్నా ఆధారాలు కావాలా?
ఢిల్లీలో చిదంబరంతో బాబు భేటీ...!
శంకర్రావు, టీడీపీ నేతలు వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువడటానికి రెండు రోజుల ముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. హోంమంత్రి చిదంబరాన్ని ఒంటరిగా కలిశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతకు... యూపీఏ ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న వ్యక్తితో పనేంటి? అదీ రహస్యంగా కలవాల్సిన అవసరమేంటి? ఉమ్మడి శత్రువును ఎలా ఇబ్బంది పెట్టాలనే చర్చ గురించి కాదా? ఎమ్మార్ కేసులో తన జోలికి రావద్దని చెప్పటానికి కాదా? సీబీఐని ఎలా ఉపయోగించుకోవాలనే మంతనాలు జరగలేదా? అందుకు ప్రతిగా రాష్ట్రంలో ప్రభుత్వానికి తాను బాసటగా ఉంటానని హామీ ఇవ్వలేదనుకోవచ్చా? బాబు తనను కలిసిన విషయాన్ని పార్లమెంటు సాక్షిగా చిదంబరం చెబితే తప్ప నిజం నిగ్గు తేలలేదు. చంద్రబాబు దీనికేమంటారు?
ఇది చేతులు కలపడం కాదా?
* ఐఎంజీకి రూ.8,500 కోట్ల విలువైన భూముల్ని కేవలం రూ. 4 కోట్లకు కట్టబెట్టేసిన చంద్రబాబుపై దర్యాప్తు జరపటానికి తమ వద్ద సిబ్బంది లేరని చెప్పిన సీబీఐతో ఆయన కుమ్మక్కయ్యారనటం అబద్ధమా?
* ఎమ్మార్ వ్యవహారంలో... పోటీ లేకుండా భూమినిచ్చేసి, దాన్లోకి విల్లాల్ని చొప్పించి, కొల్లగొట్టడానికి కొలాబరేషన్ ఒప్పందాన్ని కూడా తెచ్చిన చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చేసిన సీబీఐ ఆయనతో కుమ్మక్కయిందనలేమా?
* ఉప ఎన్నికల్లో తన క్రియాశీలక సభ్యుల చేత కూడా కాంగ్రెస్‌కు ఓట్లేయించి, సొంత అభ్యర్థికి డిపాజిట్ కూడా రానివ్వని చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనటం పచ్చి నిజం కాదా?
* వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై శంకర్రావు దాఖలు చేసిన కేసులో తాము కూడా ఇంప్లీడ్ అయ్యి... తీర్పు రావటానికి రెండ్రోజుల ముందు ఢిల్లీలో రహస్యంగా చిదంబరాన్ని కలిసిన బాబు కాంగ్రెస్ అధిష్టానంతో సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకోలేదని ఎవ్వరైనా చెప్పగలరా?
* బాబు హయాంలో జరిగిన కుంభకోణాలన్నిటినీ ఆధారాలతో సహా ప్రజాహిత వ్యాజ్యం రూపంలో వై.ఎస్.విజయమ్మ కోర్టుకు సమర్పించినపుడు... బాబు అవినీతిపై కోర్టు దర్యాప్తునకు ఆదేశించినపుడు కాంగ్రెస్ స్పందించకపోవటం కుమ్మక్కుకు నిదర్శనం కాదా?
* తర్వాత దాన్ని హైకోర్టు దురదృష్టకర రీతిలో కొట్టేసినపుడు కాంగ్రెస్ స్పందించకపోవటం బాబుతో కుమ్మక్కు కావటం వల్లేననటం అబద్ధమా?
* సమాచార కమిషనర్ల నియామకంలో తన వారికి పదవి దక్కటం కోసం అధికార పక్షంతో బాబు కుమ్మక్కు కాలేదా?
* ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నపుడు, ప్రతిపక్షాలన్నీ కలిస్తే ప్రభుత్వం ఖాయంగా కూలిపోతుందన్నపుడు అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు ఎందుకు ముందుకు రాలేదు? మాటలతో కాలక్షేపం చేశారెందుకు? కాంగ్రెస్‌తో కలవటం వల్ల కాదా? ప్రభుత్వాన్ని కాపాడినందుకు తనను కేసుల నుంచి బయటపడేయాలని ఒప్పందం చేసుకోవటం వల్ల కాదా?
* పీఆర్పీ వెళ్లి కాంగ్రెస్‌లో విలీనమయ్యాక... అవిశ్వాసం పెట్టినా ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదని నిర్ధ్ధారించుకున్నాక కావాలని అవిశ్వాసం పెట్టడం ఈ కుమ్మక్కు కుట్రను కళ్లకు కట్టలేదా?
* ఈ ఏడాది 18 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్- టీడీపీ చేతులు కలపలేదా? అసలు టీడీపీకి 5 చోట్ల, కాంగ్రెస్‌కు 7 చోట్ల డిపాజిట్లు రాలేదంటే కుమ్మక్కు స్పష్టంగా కనిపించటం లేదా?
* ఈ మూడేళ్లలో టీడీపీ ఎన్నడైనా ప్రతిపక్షంగా పనిచేసిందా? ఎంతసేపూ టీడీపీ- కాంగ్రెస్ రెండూ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవటానికి కుట్రలు పన్నటం, వైఎస్సార్ కాంగ్రెస్‌ను విమర్శించటం తప్ప ఇంకేమైనా చేశాయా? ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాయా? ఇవన్నీ కుమ్మక్కు కుట్రకు నిదర్శనాలు కావా బాబూ..?
ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలు...
గతేడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్ విజయానికి దేశం సహకరించగా... అనంతపురంలో తెలుగుదేశం గెలిచేలా కాంగ్రెస్ నేత జేసీ దివాకరరెడ్డి చక్రం తిప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి వర్గానికి చెక్ చెప్పేందుకు ఈ ఫిక్సింగ్‌కు తెరతీసినా... వారి పాచికలైతే సమర్థంగా పారలేదనే చెప్పాలి. ఆ తరవాత సమాచార హక్కు కమిషనర్ల నియామకంలోనూ బాబు ఫిక్సింగ్‌కు తెరతీశారు. ఇవి చాలవన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో పిల్లిమొగ్గలు వేసి బహిరంగంగానే ఫిక్సింగ్ డ్రామాను రక్తి కట్టించారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు అవిశ్వాసం పెడతామని ప్రకటన చేయటం... తీరా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉండటంతో వెనక్కి తగ్గటం బాబు డ్రామాలో భలే ఘట్టం. చివరకు పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక... ఇక ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోదని నిర్ధారించుకున్నాక సింహనాదాలు చేస్తూ బాబు అవిశ్వాసానికి సై అన్నారు. తాను ఊహించినట్లే ప్రభుత్వం పడిపోకుండా ఆపగలిగారు. అసలు దీన్ని ఏ రకంగా కుమ్మక్కు కాదంటారో చంద్రబాబు తప్ప ఎవ్వరూ చెప్పలేరన్నది వాస్తవం.
ఉప ఎన్నికలతో పరాకాష్టకు..
కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కును తారస్థాయిలో కళ్లకు కట్టిన ఘట్టం ఉప ఎన్నికలు. ఎన్నికల్లో ఎలాగూ ఓటమి తప్పదని గ్రహించిన ఈ రెండు పార్టీలూ చివరకు జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తే ఆ పార్టీ విజయాన్ని కొంతవరకైనా అడ్డుకోవచ్చన్న ఉద్దేశంతో చక్రం తిప్పి... ఎన్నిలకు కేవలం 15 రోజుల ముందు ఆయన్ను అరెస్టు చేయించగలిగాయనేది బహిరంగ రహస్యం. ఇన్ని చేసినా ఆయన నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేకపోతున్నామని గ్రహించిన ఈ రెండు పార్టీలూ ఎన్నికల ముందు మరింత బరితెగించేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గెలవకుండా ఒకరి ఓట్లు మరొకరికి పడేలా ప్రచారానికి సైతం వెనుకాడలేదు. ఇన్ని చేసినా వాటి లక్ష్యమైతే నెరవేరలేదు. కానీ ఈ కుమ్మక్కు మాత్రం త్రీడీ సినిమాలా జనానికి తెలిసిపోయింది. తనకు గట్టి పట్టుందని చెప్పుకున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రామచంద్రపురం, నరసాపురం స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అక్కడ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన 15 స్థానాల్లో ఈ రెండు పార్టీలూ ఓట్లు బదలాయించుకున్నా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు కనీస దూరంలో నిలవలేకపోయాయి. ఇవన్నీ చూస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారనేది స్పష్టం కావటం లేదా? దొంగే తిరిగి పోలీసును దొంగా దొంగా అని అరుస్తున్న వైనం బయటపడటం లేదా? ఇంకా ఎన్నాళ్లీ డ్రామాలు? తన కుమ్మక్కు కుట్రను కప్పి పుచ్చుకోవటానికి ఎదుటివారిపై నిందలేస్తే సరిపోతుందా? జనం నమ్మేస్తారా?
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుదేలు
2009 సెప్టెంబర్ 2న వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్, టీడీపీలు కుదేలవుతూ వస్తున్నాయి.
* 2009 డిసెంబర్ 5న పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.విజయమ్మ ఏకగ్రీవంగా గెలుపొందారు.
* 2010 జూలై 27న తెలంగాణలోని 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 11 స్థానాల్ని టీఆర్‌ఎస్, ఒక స్థానాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో 10 స్థానాల్లో కాంగ్రెస్, కేవలం రెండు స్థానాల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచాయి.
* 2011 మే 8న జరిగిన ఉప ఎన్నికల్లో కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలు రెండిటా వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. లోక్‌సభ స్థానాన్ని 5.45 లక్షలు, అసెంబ్లీని 81 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో దక్కించుకున్నారు.
* 2011 అక్టోబర్లో బాన్స్‌వాడ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ
ఎన్నికలకు దూరంగా ఉండగా... టీఆర్‌ఎస్ గెలుచుకుంది.
* 2012 మార్చిలో తెలంగాణలోని ఆరు స్థానాలకు, నెల్లూరు జిల్లా కోవూరు స్థానానికి జరిగిన ఎన్నికల్లో కోవూరును వైఎస్సార్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. తెలంగాణలో అది పోటీ చేయకపోవటంతో నాలుగు స్థానాల్ని టీఆర్‌ఎస్, ఒకటి ఇండిపెండెంట్, ఒకటి బీజేపీ గెలిచారు.
* 2012 మేలో తెలంగాణలోని పరకాల స్థానానికి, సీమాంధ్రలోని 17 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్రలోని 15 స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పరకాలలో విజయం అంచులకు చేరినా... చివరికి 1,563 ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ గెలిచింది. ఐదు స్థానాల్లో తెలుగుదేశానికి, ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కకపోవటం గమనార్హం.
ఫిక్సింగ్ అవసరం ఎవరికుంది?
అసలు కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎవరికుంది? వేరొకరితో చేతులు కలపాల్సిన అవసరం ఏ పార్టీకుంది? ఏ ఎన్నిక చూసుకున్నా ఊహించని మెజారిటీతో విజయ ఢంకా మోగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు... కాంగ్రెస్‌తో కలిస్తే కలిసొచ్చేదేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌వేనని ప్రతి సర్వే స్పష్టంగా చెబుతున్నపుడు వేరే పార్టీతో అవగాహన కుదుర్చుకుంటే సీట్లు పోతాయి తప్ప కలిసొచ్చేదేముంటుంది? నానాటికీ కునారిల్లి డిపాజిట్లు సైతం కోల్పోతున్న టీడీపీకి కాంగ్రెస్‌తో జతకడితేనన్నా కాసిన్ని సీట్లు వస్తాయనేమోనన్న దింపుడు కల్లం ఆశ లేదంటే ఒప్పుకోగలమా? కాంగ్రెస్ -టీడీపీ చర్యలు కూడా దీన్ని బలపరచటం లేదా? గడిచిన మూడేళ్లుగా ఈ రెండు పార్టీలూ కలిసి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేయటం తప్ప ఏమైనా చేశాయా? అధికార పక్షం హోదాలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ఎన్నడైనా దృష్టిపెట్టిందా? దాని వైఫల్యాల్ని ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఎన్నడైనా నిలదీసిందా? పోనీ వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీస్తున్నపుడు, నిరసన తెలుపుతున్నపుడు దానికి మద్దతైనా ఇచ్చిందా? ఇవన్నీ దేనికి చిహ్నం? వీటన్నిటినీ కప్పిపుచ్చటం సాధ్యమా?
ప్రతి సర్వేలోనూ జగన్ వెంటే జనం
2010 డిసెంబర్లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి వెలుపలికి వచ్చి... ఆ తరవాత వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, ఏ సర్వే జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్‌దే ముందంజ అంటే... దానిపై, దాని అధినేత జగన్‌పై జనానికున్న విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు.
* అప్పటికింకా జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండగా... 2010 జూన్‌లో ఎన్‌టీవీ-నీల్సన్- ఓఆర్‌జీ సంస్థలు కలిసి సర్వే నిర్వహించాయి. దీన్లో ముఖ్యమంత్రిగా ఎవరిని ఇష్టపడతారన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రజల్లో 44 శాతం మంది జగన్‌మోహన్‌రెడ్డి వైపు మొగ్గు చూపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై 31 శాతం మంది విశ్వాసం ప్రకటించగా... నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు 9 శాతం, అప్పటికింకా విలీనం కాని ప్రజారాజ్యం పార్టీ అధిపతి చిరంజీవికి 5 శాతం, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు 8 శాతం మంది మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ పథకాలను అమలు చేయటమైనా, రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లటమైనా వై.ఎస్.జగన్‌కే సాధ్యమని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
* 2010 డిసెంబర్లో జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చేశారు. అయితే కొత్త పార్టీ పెడతానన్నారు గానీ పేరు ప్రకటించలేదు. అప్పుడు... అంటే 2011 ఫిబ్రవరిలో మళ్లీ ఎన్టీవీ-నీల్సన్ - ఓఆర్‌జీ సర్వే నిర్వహించాయి. ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి విజయావకాశాలు ఉంటాయ’న్న అంశంపై అది నిర్వహించిన సర్వేలో 35 శాతం మంది జగన్‌కు ఓటేశారు. చంద్రబాబుపై 19 శాతం మంది, కేసీఆర్‌పై 19 శాతం మంది, అప్పుడే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కిరణ్‌కుమార్ రెడ్డికి 15 శాతం మంది, చిరంజీవికి 5 శాతం మంది మద్దతు ప్రకటించారు. అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ పార్టీ (అప్పటికింకా పేరు పెట్టలేదు) 139 -153 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందన్న అభిప్రాయం కూడా ఆ సర్వేలో వ్యక్తమైంది.
* 2011 ఆగస్టులో సీఎన్‌ఎన్- ఐబీఎన్ - సీఎన్‌బీసీ టీవీ18 సంస్థలు నిర్వహించిన సర్వేలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్‌వైపే మెజారిటీ ప్రజలున్నారన్న అభిప్రాయం వ్యక్తమయింది.
* ఇక తాజాగా ఈ ఏడాది ఆగస్టులో... అంటే గత నెలలో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి అభిప్రాయ సేకరణలో సైతం... ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. మొత్తం 42 ఎంపీ సీట్లకు గాను వైఎస్సార్ కాంగ్రెస్‌కు 23 నుంచి 27 స్థానాలు రావచ్చని, టీఆర్‌ఎస్, టీడీపీలకు కలిసి 11 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశముందని, కాంగ్రెస్‌కు మూడు సీట్లకు మించి రావని ఆ సర్వే అభిప్రాయపడింది.
* ఇటీవలే ఎన్‌డీటీవీ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డికి రాష్ట్రంలో 48% మంది మద్దతు పలకగా... టీడీపీ అధిపతి చంద్రబాబుపై 18% మంది, కేసీఆర్‌పై 17 శాతం మంది, సీఎం కిరణ్‌కుమార్‌పై 11% మంది విశ్వాసం వ్యక్తం చేశారు.
కుమ్మక్కుతో ఎవరికి లాభం?
ఏ సర్వే చూసినా వై.ఎస్.జగన్‌పై రాష్ట్ర ప్రజలు అపారమైన ఆదరాభిమానాలు కనబరుస్తున్నారన్నది స్పష్టం. సీఎంగా ఆయన్ను గెలి పించటానికి సిద్ధమయ్యారన్నదీ నిజం. అలాంటపుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయితే జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చేదేంటి? గెలిచే పార్టీకి వేరొక పార్టీని దెబ్బతీయటానికి అధికార పక్షంతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఉంటుందా? ఓడిపోయే పార్టీలు రెండు కలిసి గెలిచే పార్టీని దెబ్బతీస్తున్నాయంటే నమ్మొచ్చు గానీ... గెలిచే పార్టీ ఓడిపోయే పార్టీతో కలిసి మరో ఓడిపోయే పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోం దంటే నమ్మేదెవరు? రాష్ట్రంలో పరిణామాలు చూస్తున్న వారు ఈ నిజాల్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారా? లేక తన మీడియా ద్వారా వారిని కూడా నమ్మించగలమనేది బాబు విశ్వాసమనుకోవాలా?
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=49654&Categoryid=1&subcatid=1

No comments:
Post a Comment