రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు చేశానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. గురువారం విజయమ్మ వినాయకుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగి సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించానన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు విజయారెడ్డి మాట్లాడుతూ, అన్ని ఆటంకాలు తొలగిపోవాలని గణనాథుడిని పూజించానని తెలిపారు. జగనన్న నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా వద్దకు చేరుకున్న విజయమ్మకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
అక్కడినుంచి వినాయకుడి వద్దకు బయల్దేరిన విజయమ్మ వెంట అభిమానులు కదులుతూ ‘వైఎస్‌ఆర్ అమర్హ్రే.... జగన్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదించారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ విజయమ్మను శాలువాతో సత్కరించి, వినాయకుని చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం విజయారెడ్డి, జేఏసీ నాయకుడు చందు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పుత్తా ప్రతాపరెడ్డి, ఆదం విజయకుమార్, శివకుమార్, వాసిరెడ్డి పద్మ, పెరిక సురేష్, స్థానిక నాయకుడు కమ్మరి వినయ్, కమ్మరి వెంకటేష్, శ్రీనివాస్‌యాదవ్, సత్యనారాయణ, బండిరాజు పాల్గొన్నారు.
No comments:
Post a Comment