హైదరాబాద్, న్యూస్‌లైన్: గుండె సంబంధిత సమస్యతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మంగళవారం సాయంత్రం పరామర్శించారు. ఆమె వెంట ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో ఉన్న ఎస్వీ సుబ్బారెడ్డికి గురువారం బైపాస్ సర్జరీ జరుగుతుందని ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. కాగా, నాలుగు నెలల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్న చెన్నకేశవ రెడ్డి తిరిగి గుండె సంబంధ సమస్య తలెత్తడంతో గ్లోబల్ హాస్పిటల్‌లో చేరారు. డాక్టర్ రవికుమార్ ఆలూరి ఆధ్వర్యంలో యాంజియోగ్రామ్ చేయగా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయని గుర్తించడంతో యాంజియోప్లాస్టీ చేశారని, ఇప్పుడు చెన్నకేశవరెడ్డి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబసభ్యులకు విజయమ్మ ధైర్యం చెప్పారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=457652&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment