YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 24 September 2012

1న వైఎస్ఆర్ సీపీ రక్తదాన శిబిరాలు

జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ వైద్యవిభాగం అక్టోబర్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆ విభాగ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ శివభారత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన సోమవారమిక్కడ సూచించారు. అక్టోబర్‌ 1న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని శివభారత్‌రెడ్డి కోరారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=456558&Categoryid=14&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!