హైదరాబాద్, న్యూస్‌లైన్: పెంచిన ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ సర్‌చార్జీలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆం దోళనలు జరిగాయి. ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్ట రేట్‌ల ముట్టడిలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ ఆయా జిల్లాల కన్వీనర్లు ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డిల నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మె ల్సీ రెహ్మాన్, రాష్ర్ట సేవాదళం కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.
పజలపై రోజుకో రూపంలో భారం మోపుతున్న ప్రభుత్వంపై వారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిన కిరణ్ సర్కారు.. చార్జీలతో చావబాదుతోందని ధ్వజమెత్తారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తాప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458368&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment