న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఆస్తుల కేసులో బెయిల్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 14వ తేదీన జగన్ బెయిల్ పిటిషన్‌పై తొలివిడత విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. ఆస్తుల కేసులో సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారన్న సీబీఐ వాదనకు ఆధారమైన ‘సూరీడు వాంగ్మూల నిరాకరణ’ వ్యవహారంలో సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద కీలక సాక్షి సూరీడుకు సమన్లు పంపాలని లోగడ ప్రత్యేక కోర్టులో సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును, సదరు దరఖాస్తుపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జారీచేసిన సమన్ల ఉత్తర్వును తదుపరి విచారణలోగా కోర్టుకు సమర్పించాలని గత విచారణ సమయంలో ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. కాగా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌పై కూడా ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది.
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=458672&Categoryid=1&subCatId=32
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=458672&Categoryid=1&subCatId=32
No comments:
Post a Comment