ఎస్సీల వర్గీకరణ చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చినా, రాజ్యాంగంపై గౌరవం లేకుండా, మాలలను మోసం చేసే విధంగా వర్గీకరణకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించే పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని మాలమహానాడు పిలుపునిచ్చింది. చంద్రబాబు చేసేది జనచైతన్య యాత్ర కాదని, జనాలను మోసం చేసే యాత్ర అని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.చెన్నయ్య సోమవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవంతో రాజీనామాలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=456787&Categoryid=1&subcatid=33
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=456787&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment