సీఎం కిరణ్ చేతకానితనం, అసమర్థతతో ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ దుయ్యబట్టారు. ఏటా విద్యుత్ సర్‌చార్జీల పేరిట రూ.600 కోట్లు, ఆర్టీసీ చార్జీల పెంపుతో మరో రూ.400 కోట్ల భారం మోపుతున్నారని మండిపడ్డారు. చార్జీల పెంపునకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్ సర్కారు పేదల్ని దగా చేస్తూ.. పెద్దలకు లబ్ధి చేకూరుస్తోందని విమర్శించారు. తక్కువ ధరకు కరెంట్ పంపిణీ చేసే సంస్థలకు ప్రభుత్వం గ్యాస్ సరఫరా చేయకుండా ల్యాంకో, జీఎంఆర్ వంటి బడా కంపెనీలకు అందజేస్తోందని మండిపడ్డారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=457018&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=457018&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment