YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 20 August 2012

వైఎస్ఆర్ సీపీ నిర్ణయంపై బీసీల హర్షం

పులివెందుల : చట్టసభల్లో బిసిలకు వంద సీట్లు కేటాయించాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై బిసిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో సోమవారం ఉదయం విజయమ్మను కల్సుకుని స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బిసిలపై మొసలి కన్నీరు కార్చారని, దివంగత మహానేత వైఎస్ మాత్రమే తమకెంతో మేలు చేశారని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు విజయమ్మ, జగన్ తమకు అండగా నిల్వడం ఆనందంగా ఉందని తెలిపారు. 

విజయమ్మను కలిసిన భూనిర్వాసితులు

పులివెందుల : యురేనియం కార్పోరేషన్ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మను కలుసుకున్నారు. జీవనాధారమైన భూములు కోల్పోయినా కూడా ... ఇంతవరకూ యురేనియంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని వారు ఈ సందర్బంగా విజయమ్మ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన వైఎస్ విజయమ్మ యురేనియం భూనిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని యురేనియం కార్పోరేషన్‌ డైరెక్టర్ బెహల్‌కు ఈ విషయమై లేఖ రాశారు. 

కాగా ఈరోజు మధ్యాహ్నం విజయమ్మ 3 గంటలకు తొండూరు మండలం ఇనగలూరులో ఆర్‌వో ప్లాంటుతోపాటు అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పాలూరు గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. మంగళవారం యథావిధిగా ఎమ్మెల్యే కార్యాలయంలో విజయమ్మ ప్రజలకు అందుబాటులో ఉంటారు.

Sunday, 19 August 2012

విజయమ్మ లేఖపై తీవ్ర చర్చ

వంద టిక్కెట్లు కాదు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు వంద సీట్లిద్దామన్న వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీడీపీ పొలిటికల్‌ మైలేజీ కోసం బీసీ డిక్లరేషన్‌ను తెరపైకి తెచ్చినా... వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనపై ఏ విధంగా రెస్పాండ్‌ అవుతుందో అనేది ఆ పార్టీకి డైలామానే. 

అయితే మిగతా పక్షాలు మాత్రం వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. అన్ని పార్టీలు దీనిపై సీరియస్‌గా ఆలోచించాలని అభిప్రాయపడ్డాయి. దీని కంటే ముందు ఎన్నికల సంస్కరణలు వస్తే వంద సీట్ల వంటి ప్రతిపాదనలు సత్ ఫలితాలు ఇస్తాయని టీఆర్‌ఎస్‌ అభిప్రాయపడింది. ఈ అంశంపై సోమవారం ఉదయం సాక్షి హెడ్‌లైన్‌షోలో చర్చ జరిగింది.

Vijayamma challenges Naidu on seats for BCs


Terming TDP president N.Chandrababu Naidu’s BC Declaration a gimmick to gain power in the 2014 polls, YSR Congress honorary president YS Vijayalakshmi has challenged him to support her proposal for `reservation’ of 100 seats in the state legislature for BCs instead of fielding BCs from “non-potential” constituencies if Naidu is really committed to the political empowerment of BCs.
In an open letter to Naidu on Sunday, Vijayamma said that her party wanted to field BCs in 100 general-category constituencies so as not to do injustice to SCs, STs and minorities. “The TDP and the YSRCP should identify 100 general constituencies to allot tickets exclusively to BCs, excluding those constituencies which are dominated by SCs, STs and minorities. Naidu should accept my proposal if his  love for BCs is real,’’ she said.
“If you are ready to allot tickets to BCs from general constituencies, come, let us sit together and identify those segments by draw of lots. If our two parties take a decision in this regard, the Congress  and other parties will follow suit.”
The YSRCP was ready to allot 100 constituencies to BCs in the 2014 polls, she said and added that she was making the promise on behalf of her son YS Jagan Mohan Reddy who is the party president.
“Though Naidu had promised to field BCs in 100 constituencies in the 2009 polls, he fielded only 47. In comparison, my husband YS Rajasekhara Reddy allotted 67 seats to BCs then,” Vijayamma recalled.

వైఎస్సార్‌సీపీ సూపర్‌హిట్ పార్టీ

వైఎస్సార్‌సీపీ ఒక సూపర్, డూపర్ హిట్ సినిమా అని, కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఫ్లాప్ సినిమాలని సినీ నటుడు గిరిబాబు పేర్కొన్నారు. పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో సినీ, టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణుల సమావేశం ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఇందులో గిరిబాబు మాట్లాడుతూ.. జగన్‌పై దుష్ర్పచారం చేయడమనే ఏకసూత్ర ప్రణాళికతో టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఊరూరా తిరుగుతున్నారని, కానీ వారి మాటల్ని జనం విశ్వసించడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకెళ్లి.. వైఎస్ జీవించి ఉన్నపుడు అమలైన పథకాలేమిటి? ఇపుడు వాటిని ఎలా నాశనం చేస్తున్నారు? అని కళాకారులు చెప్పాలని ఆయన సూచించారు. సినీ రంగం నుంచి ఇంకా చాలామంది పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జగన్ తిరుగులేని నాయకుడని, ఆయన ప్రజల వద్దకు వెళుతున్నారనే దుగ్ధతోనే జైలులో పెట్టారని పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్‌ను జైలులో ఉండగా చూడలేనని, అందుకే కలిసే యత్నం చేయలేదన్నారు. 

వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో సమర్థులైన నాయకులు కొరవడ్డారని, ఆ లోటును పూడ్చడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అభిప్రాయపడ్డారు. వైఎస్ అసంపూర్తిగా వదలి వెళ్లిన పథకాల అమలు ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు. ఓదార్పు యాత్రలో జగన్ వెంట తిరిగాను కనుకే ఈ విషయం చెప్పగలుగుతున్నానన్నారు. ‘‘తన తండ్రి మరణించాక రెండున్నరేళ్లుగా జగన్ గ్రామాల్లో తిరుగుతూ, ప్రజల మధ్యనే ఉంటూ వారి పేదరికాన్ని దగ్గరగా చూశారు. తాను అధికారంలోకొస్తే వారందరి సమస్యలు తీర్చాలన్న తపన ఆయనకుంది’’ అని వివరించారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్‌కు సినీ, టీవీ రంగంవారు మద్దతు నివ్వడం హర్షణీయమన్నారు. వంగపండు ఉష అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి సినీ హీరో రాజా, వైభవ్, డిజిటల్ ఫిల్మ్స్ ఫోరం ఫర్ ఇండియా చైర్మన్ పి.సి.ఆదిత్య, టీవీ సంఘాల ఫెడరేషన్ నేత కూరపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వారు రవికుమార్, చిన్నికృష్ణ, శశిధర్, పార్టీ సీఈసీ సభ్యుడు రాజ్‌సింగ్ ఠాకూర్‌తోసహా పలువురు పాల్గొన్నారు.

పాలకుల అసమర్థత వల్లే కర్నూలుకు కష్టాలు


రాష్ట్ర ప్రభుత్వం చేత కాని తనం వల్లే కర్నూలు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. కర్ణాటక రైతులు తుంగభద్ర డ్యాం ఎల్‌ఎల్‌సీ గేట్లను దౌర్జన్యంగా మూసేసి నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా.. జిల్లాకు చెందిన మంత్రులు మొద్దునిద్ర వీడటంలేదని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తుంగభద్ర నుంచి కర్ణాటక అక్రమంగా నీటిని తరలించుకుపోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆమె తెలిపారు. ఇన్నాళ్లు డ్యామ్‌లో నీరులేక అల్లాడిన రైతులు పరిస్థితి ఇప్పుడు సమృద్ధిగా ఉనప్పటికీ మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు చెందిన మంత్రులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం తీసుకొని తుంగభద్ర నీటిని రైతులకు సక్రమంగా అందించాలని ఆమె కోరారు. అవసరమైతే జిల్లాకు చెందిన మంత్రులు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేకూర్చాలని శోభానాగిరెడ్డి సూచించారు.

చంద్రబాబుకు విజయమ్మ బహిరంగ లేఖ


శాసనసభలో బీసీలు తలెత్తుకునేలా చేద్దాం 
చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే ముందుకు రండి..
బీసీలపై చంద్రబాబు కారుస్తున్నవి మొసలి కన్నీళ్లే 
అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఏం చేశారు బాబూ?
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 100 సీట్లు ఇస్తామన్నారు 
కానీ ఇచ్చింది 47 టికెట్లే.. అదీ మీ చరిత్ర.. మీ నైజం 
అదే ఎన్నికల్లో బీసీలకు వైఎస్‌ఆర్ 67 టికెట్లు ఇచ్చారు
వంద టికెట్లు కాదు.. బీసీలకు 100 సీట్లిద్దాం రండి
బీసీ జనాభాను బట్టి వంద నియోజకవర్గాలను లాటరీతో నిర్ణయిద్దాం.. ఆ సీట్లలో బీసీలను మాత్రమే నిలబెడదాం
మాతోపాటు టీడీపీ కూడా ముందుకొస్తే.. మిగతా పార్టీలూ అదే బాటలో నడిచే అవకాశముంది..

బాబూ! మీరు సబ్సిడీలు ఉండరాదన్నారు.. సేద్యం దండగన్నారు 
బీసీలను దగా చేసి.. కులవృత్తులను ధ్వంసం చేశారు
ఎన్టీఆర్ జనతా వస్త్రాల పథకాన్ని మీరు రద్దు చేశారు 
పిల్లల చదువుల గురించి ఏనాడైనా ఆలోచించారా? 
అనారోగ్యం పాలైనప్పుడు ప్రజలను ఆదుకున్నారా? 
ప్రభుత్వాస్పత్రుల్లోనూ యూజర్ చార్జీలు వడ్డించారు 
నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఆలోచన చేశారా?


‘‘వైఎస్ జగన్ మాటగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. బీసీలకు వంద టికెట్లు ఇవ్వటం కాదు.. అసెంబ్లీలో 100 సీట్లు వారికి కేటాయిద్దాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలను, ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటిలో బీసీల జనాభా 25 వేలకు పైనే ఉంటుంది. రండి.. మన రెండు పార్టీలూ కూర్చుందాం. బీసీల జనాభా ప్రాతిపదికన 100 అసెంబ్లీ స్థానాలను లాటరీ ద్వారా నిర్ణయిద్దాం. ఆ సీట్లలో బీసీ అభ్యర్థులను మాత్రమే నిలబెడదాం. ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అలాంటి నిర్ణయానికి సిద్ధపడితే.. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. మీకు నిజాయతీ ఉందనుకుంటే.. బీసీలకు మేలు చేసే ఉద్దేశమే ఉంటే.. మా ప్రతిపాదనను అంగీకరించండి.’’ 


హైదరాబాద్, న్యూస్‌లైన్: వెనుకబడిన తరగతుల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశం, చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరఫున వంద టికెట్లు ఇవ్వటం కాదు.. అసెంబ్లీలో వంద సీట్లు ఇవ్వటానికి సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సవాల్ విసిరారు. బీసీల విషయమై చంద్రబాబు చెప్తున్న మాటలు నిజమే అయితే తమ ప్రతిపాదనను అంగీకరించాలన్నారు. విజయమ్మ ఈ మేరకు ఆదివారం చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. జరగని పనికి ఢిల్లీ వెళ్లి డ్రామా ఆడే కంటే శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని బాబుకు ఆమె సూచించారు. విజయమ్మ రాసిన లేఖను పార్టీ బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, సీఈసీ సభ్యులు రాజ్‌సింగ్‌ఠాకూర్, బి.శివకుమార్‌లు విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. 
లేఖ పూర్తిపాఠం... 

‘‘చంద్రబాబు గారూ... 

గడచిన కొన్ని రోజులుగా మీరు చేస్తున్న ప్రకటనలు చూస్తూంటే ఈ రాష్ట్ర ప్రజలను తేలిగ్గా వంచించవచ్చని, తొమ్మిదేళ్ల పాలనలో మీ నిర్వాకాలన్నీ వారికి ఏ మాత్రం గుర్తులేవని మీరు భావిస్తున్నట్లుగా ఉంది. సబ్సిడీలు ఉండరాదని, వ్యవసాయం దండగని ప్రకటించిన మీరు.. మీ హయాంలో రైతులు, నేతన్నలు, మత్స్యకారులు, గీత కార్మికులు, రజకులు, క్షురకులు, కుమ్మర్లు, కమ్మర్లు.. ఇలా ఏ వృత్తిని ఎంచుకున్న వారికైనా పల్లెల్లో జీవించే అవకాశమే లేకుండా చేసిన మాట వాస్తవం కాదా? అలాంటి మీకు అసలు బీసీల గురించి మాట్లాడే హక్కుందా? అధికారంలో ఉండగా ఏనాడైనా మీరు బీసీల గురించి నిజాయతీగా ఆలోచన చేశారా?

అండగా నిలవాలన్న ఆలోచనా చేయలేదే... 

బీసీల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న మీరు.. వారి కోసం ఏం చేశారంటే.. ప్రజలెన్నుకున్న సీఎం ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన జనతా వస్త్రాల స్కీమును, ఆయనకు వెన్నుపోటు పొడిచి రద్దు చేశారు. బీసీలకు పెన్షన్లు ఇవ్వాలని, ఒక పూట అయినా భోజనం దొరికేలా చేయాలని మీ మొత్తం జీవితంలో ఏనాడైనా ఆలోచన చేశారా? నాలుగు జతల దుస్తులు స్కూలు పిల్లలకు ఇవ్వాలని, తద్వారా నేతన్నలకు మంచి చేయాలని మీరు అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడూ మీకు అనిపించలేదే! బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు పెట్టి వారికి అండగా నిలవాలని కూడా ఏనాడూ ఆలోచన రాలేదే! తమరు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క కాలేజీకైనా వెళ్లి విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో తెలుసుకోవాలని, ఆ చదువుల కోసం పిల్లల తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారో గుర్తించి వాటిని పరిష్కరించాలని ఎప్పుడూ అనిపించలేదు.

మీ చరిత్ర అంతా అబద్ధాలమయమే... 

మీ పాలనలో పేదలకు ఏ విషయంలో భరోసా లభించింది కనుక? విద్య, వైద్యం, కూడు, గూడు.. ఇలా ఏది చూసినా అప్పట్లో పేదలందరికీ మిగిలినది నిరాశ మాత్రమే. వైద్యం ఖర్చు భరించలేక పేదలు సర్వం అమ్ముకుని తల తాకట్టు పెట్టి అప్పుల పాలవుతున్నా మీ గుండె కరగలేదు. పేదల వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా నేనున్నానని భరోసా ఇచ్చే మంచి అన్నలా ఉండాలని ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీకు ఏనాడూ అనిపించలేదు. సర్కారీ ఆసుపత్రులకు వచ్చేది నిరుపేద ప్రజలన్న నిజాన్ని కూడా గుర్తించకుండా దారుణంగా యూజర్ చార్జీలు వడ్డించారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలా ఓ గూడును ఏర్పాటు చేయటంలో కులాలు, మతాలు, పార్టీలు అడ్డు రాకూడదని మీరేనాడూ భావించలేదు. ఆదరణ పథకం అంటూ పాల క్యాన్లు, ఇస్త్రీ పెట్టెలు, జాలరి వలలు వంటివి బీసీలకు ఇచ్చాం అంటూ పనికిరాని సామాను కొద్దిగా పంచి.. కాగితాల మీద అప్పట్లోనే మీరు లెక్క రాసుకున్నది అక్షరాలా రూ. 700 కోట్లు. ఈ సొమ్ములో బీసీలకు కనీసం రూ. కోటి అయినా దక్కిందా? మిగిలినదంతా మీ పార్టీ ఫైనాన్షియర్ల జేబుల్లోకి చేరటం నిజం కాదా? ఏదో తూతూ మంత్రంలా కొద్దో గొప్పో చేస్తే సరిపోతుందిలే అనే భావంతో బీసీల అభివృద్ధి అంటూ మోసం చేశారే తప్ప వారికి మీరు ఏనాడూ మంచి చేయలేదు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నది మీ మూడున్నర దశాబ్దాల చరిత్ర. పదవి కోసం ఎంతటి అబద్ధాన్నయినా కన్నార్పకుండా చెప్పే నైజం మీది. ఇప్పుడు కూడా మీరు చెపుతున్న అబద్ధం బీసీల మీద మీకున్న ప్రేమ. 

వంద టికెట్లు కాదు.. వంద సీట్లిద్దాం... 

ఈ బహిరంగ లేఖ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి మాటగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీరు కేవలం వంద టికెట్లు ఇస్తామంటున్నారు. దాని వల్ల బీసీలకు ఒరిగేది ఎంతో అందరికీ తెలుసు. మేం చెపుతున్నాం.. వంద టికెట్లు కాదు, అసెంబ్లీలో 100 సీట్లు వారికి కేటాయిద్దామని. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతున్నప్పుడు కూడా జగన్‌బాబు ఒక ప్రతిపాదన చేశారు. ఉన్నవి నాలుగు ప్రధాన పార్టీలు కాబట్టి అందరం కలిసి కూర్చుని జనరల్ స్థానాల్లో నుంచి 33 శాతాన్ని మనమే లాటరీ ద్వారా ఎంపిక చేసి, అక్కడ అందరం బీసీలనే పోటీ పెట్టాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ మీద కోర్టు కేసులు వాటి దారిన అవి జరుగుతున్నాయి కాబట్టి.. ఈలోగా స్వచ్ఛందంగా మనమే చేద్దామన్నారు. ఆ ప్రతిపాదన మీద మీరు కనీసం స్పందించలేదు. అంతే కాదు... మీరు 2009 ఎన్నికల్లో ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజు ఎన్నికల్లో బీసీలను మోసం చేయాలన్న కుట్ర పూరిత ఆలోచనతోనే కదా మీరు 100 టికెట్లు ఇస్తామన్నారు? తీరా మీరు ఎన్నికల్లో ఇచ్చిన టికెట్లు 47 మాత్రమే. మరి వైఎస్‌ఆర్ గారు ఇచ్చినది అక్షరాలా 67. ఇదీ మీ మాటకున్న విలువ! ఇదీ మీ బీసీ ప్రేమ! ఇదీ మీ నైజం!

ఇదిగో జగన్‌బాబు ప్రతిపాదన... 

ఇప్పుడు కూడా నేను జగన్‌బాబు చేసిన మరో ప్రతిపాదనను మీ ముందుకు తీసుకు వస్తున్నాను. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలను మైనారిటీ ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటిలో బీసీల జనాభా 25 వేల పైనే ఉంటుంది. రండి.. మన రెండు పార్టీలూ కూర్చుందాం. బీసీల జనాభా ప్రాతిపదికన ఏ 100 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు తప్ప వేరెవరికీ టికెట్లు ఇవ్వరాదో లాటరీ ద్వారా నిర్ణయిద్దాం. ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అలాంటి నిర్ణయానికి సిద్ధపడితే.. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. 

ప్రేమను చేతల్లో చూపే పార్టీ మాది... 

బీసీల మీద మాటలు మాత్రమే కాదు.. చేతల్లో కూడా ప్రేమ చూపే పార్టీ మాది. కాబట్టే ఈ ప్రతిపాదన మరోసారి చేస్తున్నాం. మీకు నిజాయతీ ఉందనుకుంటే.. బీసీలకు మేలు చేసే ఉద్దేశమే ఉంటే మా ప్రతిపాదనను అంగీకరించండి. ఊరికే ఢిల్లీ వెళ్లి జరగని పనికి మీరు డ్రామా ఆడేకంటే, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం రండి. మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు.. అన్ని పార్టీల తరఫునా కనీసం వంద మంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తలెత్తుకు నిలబడేలా ఉండాలి.’’ 

-వై.ఎస్.విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు

కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలం

పరిశ్రమల్లో లైట్లు వేసుకునేందుకూ కరెంటివ్వలేమన్న విద్యుత్ సంస్థలు.. మంగళవారం వరకు నో పవర్
4 రోజుల్లో 14 లక్షల పరిశ్రమలకు రూ.600 కోట్ల నష్టం
- వ్యవసాయానికి కరెంటు రెండు, మూడు గంటలే
- 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 7 గంటల విద్యుత్ మిథ్యే
- విద్యుత్ సరఫరా మెరుగునకు కనీస ప్రయుత్నాలు కరువు
- కేంద్రం నుంచి అదనపు విద్యుత్ పొందేందుకు చర్యల్లేవు 
- ఆర్-ఎల్‌ఎన్‌జీ కొనుగోలు చేస్తున్నట్టు గత నెలలో సీఎంవో ప్రకటన.. ఇప్పటికీ అతీగతీ లేదు..
- రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్
హైదరాబాద్, న్యూస్‌లైన్:హైదరాబాద్, న్యూస్‌లైన్: పరిశ్రమను చూస్తే.. పరిశ్రమల్లో కనీసం లైట్లు వేసుకునేందుకు కూడా కరెంటివ్వలేని దుస్థితి. ఇప్పటికే వారానికి నాలుగు రోజుల చొప్పున విద్యుత్ కోతలతో మూసివేత దశకు చేరుకున్న పరిశ్రమలపై మరో పిడుగు పడింది. శనివారం నుంచి అన్ని పరిశ్రమలకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిపేశారు. మంగళవారం వరకు పరిశ్రమలకు ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఇవ్వలేమని విద్యుత్ సంస్థలు చేతులెత్తేశాయి. కొత్తగా ఏ మేరకు కోతలు విధించాలనే విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తామని చెబుతున్నాయి. అంటే ఈ నాలుగు రోజులు పరిశ్రమలకు కరెంటు పూర్తిగా ఉండదన్నమాట! దీని ప్రభావంతో రాష్ట్రంలోని 14 లక్షల పరిశ్రమలు మూతపడనున్నాయి. ఇవన్నీ రోజుకు రూ.150 కోట్ల చొప్పున నాలుగు రోజుకు సుమారు 600 కోట్లు నష్టపోనున్నట్లు అంచనా!!

పొలానికి వెళ్తే... రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లలో 20 లక్షల కనెక్షన్లకు ఏడు గంటల ఉచిత విద్యుత్ మిథ్యగానే మిగిలిపోయింది! రోజుకు 2, 3 గంటలకు మించి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కావడం లేదు. ఒకవైపు వర్షాల్లేక, మరోవైపు కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. 

ఆరుగాలం కష్టపడ్డా కళ్లముందే పంట ఎండిపోతుంటే రైతన్న గుండె మండుతోంది!!
పల్లెను పలకరిస్తే.. గ్రామాలకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాత్రిళ్లూ విచ్చలవిడిగా కోతలు అమలవుతున్నాయి. ఉక్కపోతతో పల్లెలు అల్లాడుతున్నాయి. పొద్దంతా కష్టపడి రాత్రి సమయంలో పడుకుందామంటే కరెంటు లేక జాగారం చేయాల్సి వస్తోంది. అనేక గ్రామాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. కరెంటు లేకపోవడంతో కొళాయిల్లో నీరు రావడం లేదు. జనం దాహంతో అలమటిస్తున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో చీకటి రాజ్యమేలుతోంది! రాత్రనక, పగలనక ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంతటి క్లిష్ట పరిస్థితులల్లోనూ బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలుకు కానీ, కేంద్రం నుంచి అదనపు విద్యుత్ పొందేందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడం లేదు. గ్యాసు సరఫరా తగ్గిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) కొంటామని ప్రకటించిన ప్రభుత్వం... ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయకుండా మిన్నకుండిపోయింది!

సీఎంవో ప్రకటన ఉత్తిదేనా..?
రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు గ్యాసు సరఫరా తక్కువ కావడంతో కేవలం 28 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాసుకు ప్రత్యామ్నాయంగా రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) ఉపయోగించి అదనపు విద్యుత్ పొందే అవకాశం ఉంది. తద్వారా 1000 మెగావాట్ల వరకూ (24 మిలియన్ యూనిట్లు) అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. అయితే యూనిట్ విద్యుత్ ధర ఏకంగా 9 రూపాయలకుపైగానే ఉంటుంది.

రైతులు ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ధర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న సంగతిని ప్రభుత్వం గుర్తించడం లేదు. వాస్తవానికి రోజుకు 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) ఆర్-ఎల్‌ఎన్‌జీ ఇచ్చేందుకు గెయిల్ సంస్థ ముందుకొచ్చింది. గెయిల్ నుంచి ఆర్-ఎల్‌ఎన్‌జీ తీసుకుంటున్నట్టు సీఎం కార్యాలయం కూడా గత నెలలో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రయత్నం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అంటే ప్రభుత్వం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని అర్థమవుతోంది. సీఎంవో ఉత్తుత్తి ప్రకటన జారీచేసిందని తెలుస్తోంది. ఆర్-ఎల్‌ఎన్‌జీని దీర్ఘకాలానికి కాకపోయినా... ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న నేపథ్యంలోనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏడు గంటల కరెంటు ఎక్కడ..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వ్యవసాయ ఫీడర్లు 9,363 ఉన్నాయి. ఇందులో 3,416 ఫీడర్లకు విద్యుత్ సరఫరా ఏడు గంటల కంటే తక్కువగా ఉందని విద్యుత్ సంస్థలే అధికారికంగా ప్రకటిస్తున్నాయి. అంటే 36 శాతానికి పైగా ఫీడర్లకు ఏడు గంటల కరెంటు అందడం లేదన్నది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవసాయ పంపుసెట్ల సంఖ్య 30 లక్షలు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో 11 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఏడు గంటల విద్యుత్ అందడం లేదన్న విషయం తెలుస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి. మొత్తమ్మీద సుమారు 20 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఏడు గంటల ఉచిత విద్యుత్ అందడం లేదని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 

అదేకాకుండా మరో 1633 ఫీడర్లకు ఏడు గంటల విద్యుత్‌ను మూడు, నాలుగు విడతలుగా సరఫరా చేస్తున్నామని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవానికి 3, 4 విడతలుగా కరెంటు పోరు రావడంతో మొదట తడిపిన మడినే మళ్లీ మళ్లీ తడపాల్సి వస్తోంది. దీంతో పంట చివరి మడికి నీరు అందడం లేదు. ఫలితంగా నీరందని పంటచేనంతా కళ్లముందే ఎండిపోతోంది. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని రైతన్నలు వాపోతున్నారు. రోజుకు 2, 3 గంటలు మాత్రమే త్రీ ఫేజు (ఫుల్ కరెంటు) కరెంటు ఉంటోందని చెబుతున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే... కనీసం మోటారుతోనైనా నడిపిద్దామనుకుంటే కరెంటు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహనం కోల్పోయిన రైతన్నలు ఎక్కడికక్కడా సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న అరకొర చేతిపంపులు సరిగ్గా పనిచేయడం లేదు. దీనికితోడు కరెంటు లేక కుళాయిల్లో నీరు రావడం లేదు. దీంతో గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.

పరిశ్రమల్లో చిమ్మచీకట్లు..
ప్రస్తుతం పరిశ్రమలకు వారంలో మూడు రోజులు విద్యుత్ కోతలు అవులవుతున్నాయి. వీక్లీ ఆఫ్‌తో కలుపుకుంటే నాలుగు రోజుల కోతలున్నాయి. ఇప్పుడు ఈ కోతలు కూడా అదుపు తప్పాయి. కోతలున్నా పరిశ్రమల్లో లైట్లు వేసుకునేందుకు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. తాజాగా లైట్లకూ కరెంటు కట్ చేశారు. అంతేకాదు.. బుధవారం వరకు పరిశ్రమలకు కరెంటును సరఫరా చేయలేమని ట్రాన్స్‌కో అధికారులు తేల్చిచెప్పారు. బుధవారం తర్వాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోతలను ప్రకటిస్తామని అంటున్నారు. అంటే అప్పటివరకు పరిశ్రమలు పూర్తిగా మూసేసుకోవాల్సిందేనన్నమాట! 

వామ్మో... డిమాండ్!
రాష్ర్టంలో విద్యుత్ డిమాండ్ చుక్కలనంటుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలోనూ డిమాండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. శనివారం (ఈ నెల 18న) రాష్ట్రంలో 271 మిలియన్ యూనిట్ల (ఎంయూ) డిమాండ్ నమోదైంది. సరఫరా మాత్రం 206 ఎంయూ మాత్రమే ఉంది. అంటే లోటు 65 ఎంయూలు. వర్షాకాలంలో ఇంతస్థాయిలో విద్యుత్ లోటు ఏర్పడటం ఇదే తొలిసారి. గతేడాది ఇదే రోజున 241 ఎంయూల డిమాండ్ ఉండగా.. 238 ఎంయూల మేరకు విద్యుత్‌ను సరఫరా చేశారు. అంటే అప్పుడు లోటు కేవలం 3 ఎంయూలు మాత్రమే ఉంది! 

సాగుకు కరెంటు సరఫరా పరిస్థితి ఇదీ
- నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్‌లోని తిరుపురం సబ్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎన్‌పురం వ్యవసాయ ఫీడరుకు శనివారం కేవలం గంటా 50 నిమిషాలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యింది.
- నల్గొండ జిల్లాలోని దామరచర్ల సబ్‌స్టేషన్ నుంచి నర్సాపురం వ్యవసాయ ఫీడరుకు కేవలం 2 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారు.
- కాకినాడ డివిజన్ పరిధిలోని చేబ్రోలు, ఇంజారం, లింగంపర్తి ఫీడర్లకు కేవలం నాలుగు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారు.
- తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ రంగాపురం, పులగుర్త, తుంగపాడు తదితర ఫీడర్లకు కేవలం మూడు గంటల 50 నిమిషాలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రాష్ట్రమంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. 

రోడ్డెక్కిన పారిశ్రామికవేత్తలు


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇష్టమొచ్చినట్టు విధిస్తున్న కరెంటు కోతలపై పారిశ్రామికవేత్తలు కన్నెర్ర చేశారు. ఎడాపెడా కోతలను నిరసిస్తూ రాజధానిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడకు చెందిన పలువురు యజమానులు గత రెండ్రోజులుగా శివరాంపల్లి డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తుండగా.. ఆదివారం చర్లపల్లి, కుషాయిగూడ, నాచారం పారిశ్రామిక వాడకు చెందిన పారిశ్రామికవేత్తలు స్థానిక సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్ గేటుకు తాళాలు వేసి రెండుగంటలపాటు రోడ్డుపైనే బైఠాయించారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉదయం వేళలో విద్యుత్ సరఫరా నిలిపివేయడమేమిటని అధికారులను నిలదీశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, కొత్త పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తిందని, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. సీఐఏ, సిన్మియాస్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వై.సుధాకర్‌రెడ్డి, వి.సుధాకర్, జి.ఎస్.రెడ్డి, విశ్వేశ్వర్‌రావుల ఆధ్వర్యంలో వందలాదిగా పారిశ్రామికవేత్తలు తరలివచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీరికి సంఘీభావంగా వైఎస్‌ఆర్‌సీపీ నేత సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సైనిక్‌పురి ఏడీఈ లక్ష్మీనారాయణ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ లేదు
కరెంటు కోతల వల్ల పరిశ్రవులు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. లైట్లను వాడుకునేందుకు కూడా కరెంటివ్వలేమని అధికారులు అంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం అదనపు విద్యుత్ కొనుగోలు చేయాలి. ఆర్-ఎల్‌ఎన్‌జీ తీసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేయాలి. వరుసగా మూడు నెలల్లో రుణం చెల్లించకపోతే బ్యాంకుల్లో దొంగల మాదిరిగా ఫోటోలు అతికిస్తామని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. చివరకు మేం దొంగలుగా సమాజంలో మిగిలిపోతున్నాం. ఇది రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి మంచి సంకేతం కాదు.
- ఏపీకే రెడ్డి, ఫ్యాప్సియా అధ్యక్షుడు

బొత్సే ప్రధాన నిందితుడు



న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితుల ఊచకోత ఘటనలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే ప్రధాన నిందితుడని రాష్ట్ర దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆరోపించారు. ఆ ఘటనలో నిందితులు దాడులకు ఉపయోగించిన బడిసెలు, బాంబులకు ఆర్థిక సాయం చేసింది బొత్సే అని, ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన సీఎం కిరణ్ లక్ష్మీపేట బాధిత కుటుంబాలను పరామర్శించకుండా నిందితుల గ్రామాల్లో పర్యటించారని విమర్శించారు. 

దళిత ద్రోహిగా వ్యవహరిస్తున్న కిరణ్‌కు బొత్సను రక్షించే శక్తి ఉందా అని ప్రశ్నించారు. పద్మారావు ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కిరణ్ ప్రభుత్వ విధానాలను, బొత్స అరాచకాలను జాతీయ నేతల దృష్టికి తెస్తామన్నారు. దళితులపై జరిగిన దాడులపై ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ స్పందించాలన్నారు అస్సాంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను సందర్శించిన ప్రధాని దళితులపై దాడి జరిగిన గ్రామాల్లో ఎందుకు పర్యటించరని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితుల ఇళ్లలో చపాతీలు తిన్న రాహుల్‌గాంధీ ఏపీలో దళితుల ఊచకోత ఘటనపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ సైతం ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని, నిందితులకు శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై లేదా అని ప్రశ్నించారు. లక్ష్మీపేట ఘటనను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 21న ఏపీ భవన్‌లో జాతీయ స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, 22న జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు.

EID MUBARAK

 ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు


ముస్లింల‌కు విజ‌య‌మ్మ శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌: ముస్లింల ప‌విత్ర పండుగైనా రంజాన్‌ను ముస్లిం సోద‌రులు రేపు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుపుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌సీపీ గౌర‌వ అధ్యక్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు

ఎక్కువ విద్యుత్‌ను వాడుకునే రాష్ట్రాలపై కేంద్రం ఇకపై కొరడా

న్యూఢిల్లీ: కేటాయించిన దానికన్నా ఎక్కువ విద్యుత్‌ను వాడుకునే రాష్ట్రాలపై కేంద్రం ఇకపై కొరడా ఝళిపించే అవకాశముంది. అలాంటి రాష్ట్రాలకు భారీ జరిమానా విధించాలని, సంబంధిత అధికారులకు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల(సీఎస్)కు జైలు శిక్ష విధించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. ఎక్కువ విద్యుత్ వాడుకోవడం వల్ల సంభవించే గ్రిడ్ ఫెయిల్యూర్‌లకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.

వైఎస్ఆర్ సీపీ నేత సుజికి శ్రీనివాస్ మృతి

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ నగర బీసీ సెల్ అధ్యక్షుడు సుజికి శ్రీనివాస్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నసుజికి శ్రీనివాస్ ఆదివారం నాడు చనిపోయారు. సుజికి శ్రీనివాస్ మృతికి వైఎస్ విజయమ్మ, వైవి సుబ్బారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు సంతాపం ప్రకటించారు. 

చంద్రబాబుకు విజయమ్మ బహిరంగ లేఖ

 బీసీలకు వంద టిక్కెట్లుకాదు.. అసెంబ్లీలో వంద సీట్లిద్దామంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీలు రిజర్వ్‌డ్‌, మైనార్టీలు అధికంగా ఉండే స్థానాలు మినహాయించి బీసీ జనాభా అధికంగా ఉండే స్థానాలను వారికే కేటాయిద్దామని ప్రతిపాదించారు. వైఎస్‌ జగన్‌ మాటగా తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ దీనికి కట్టుబడితే కాంగ్రెస్‌సహా మిగతా పార్టీలూ అంగీకరిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

స్థానిక సంస్థల విషయంలో జగన్ ఇలాంటి ప్రతిపాదనే చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదని విజయమ్మ గుర్తు చేశారు. 2009లో బీసీలకు వందటిక్కెట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు 47 మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ 67 టిక్కెట్లను బీసీలకు కేటాయించారని తెలిపారు. బీసీలపై ప్రేమ మాటల్లో కాదు.. చేతల్లో చూపే పార్టీ తమదని విజయమ్మ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన: నటుడు నరేష్

రాష్ట్రంలో సీఎం కిరణ్ పాలన ధృతరాష్ట్ర వైఖరిని తలపిస్తోందని విజయనిర్మల కుమారుడు, సినీనటుడు నరేష్ విమర్శించారు. చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను కాంగ్రెస్ కార్యకర్తలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నేతన్నల సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలదేనని ఆయన ప్రశంసించారు.

స్వలాభం కోసం టీటీడీని వాడుకుంటున్నారు'

మఠాధిపతులు, పీఠాధిపతులు స్వలాభం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను వాడుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. భగవంతుని సేవల పేరుతో హిందూమత పెద్దలు స్వార్థంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. హిందువుల మత విభేదాలకు మఠాధిపతులు, పిఠాధిపతులే కారణమన్నారు. వకుళామాత ఆలయ పరిష్కారం టీటీడీ చేతుల్లోనే ఉందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.

బీసీలపై బాబు మొసలికన్నీరు: గట్టు

బీసీలను మరోసారి వంచించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు ఆరోపించారు. బీసీలపై ప్రేమను చంద్రబాబు చేతల్లో చూపాలన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే వైఎస్ విజయమ్మ చేసిన ప్రతిపాదనకు స్పందించాలన్నారు. కుల వృత్తులను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు మొసలికన్నీరును బీసీలు నమ్మరని చెప్పారు. రాజకీయ పబ్బం కోసం బీసీలకు 100 సీట్లని బాబు ప్రకటించుకున్నారని అన్నారు. 2009 ఎన్నికల్లో 100 సీట్లు ఇస్తానన్న వాగ్దానం ఏం చేశారని రామచంద్రరావు ప్రశ్నించారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!