చంద్రబాబు కుటుంబ విదేశీ లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్ కు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపైనా విచారణ జరిపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు
Sunday, 26 August 2012
కిరణ్ బిల్లు లక్ష, చంద్రబాబు విద్యుత్ బిల్లు 84వేలు!
ఒక పక్క విద్యుత్ ను ఆదా చేయండి అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు ఇస్తుంటే, మరో పక్క నేతల ఇళ్లకు అవుతున్న విద్యుత్ వ్యయం లక్షలలో ఉంటోంది. ఒక ఆంగ్ల దిన పత్రిక దీనిపై ఆసక్తికర కధనాన్ని ఇచ్చింది. దీని ప్రకారం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నెలసరి విద్యుత్ బిల్లు లక్ష రూపాయల పై మాటే. ఇక ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు జూబ్లి హిల్స్ ఇంటి జూలై నెల విద్యుత్ బిల్లు అక్షరాల 84352 రూపాయలుగా ఉంది తర్వాత మంత్రి గల్లా అరుణ ఇంటి విద్యుత్ బిలు అరవై ఐదు వేల వరకు ఉంది. మంత్రులు ముకేష్, దానం నాగేందర్ తదితరుల ఇళ్ల విద్యుత్ బిల్లు నెలకు పదిహేను వేల నుంచి పాతిక వేల వరకు ఉంటోంది.రోడ్లు భవనాల శాఖ ఈ బిల్లులను చెల్లిస్తుంటుంది. నేతల విద్యుత్ బిల్లు పెరిగిపోతుండడంతో నెలకు ఇరవై వేల రూపాయలకు పరిమితం చేస్తే మంచిదని , ఆ పైన ఎవరికి వారు భరించాలని రోడ్లు,భవనాల శాఖ ప్రతిపాదించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. ఏది ఏమైనా నేతలు ముందుగా విద్యుత్ ను ఆదా చేసి , ఆ తర్వాత ప్రజలకు సలహా ఇస్తే మంచిదేమో!
source: kommineni
source: kommineni
న్యాయ వ్యవస్థకు చురకలు వేసిన ఛీఫ్ జస్టిస్
సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ కపాడియా అధ్బుత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు దేశాన్ని పాలిస్తున్నామనో, పాలించాలనో అనుకోరాదని, పద్దతిగా తీర్పులు ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేయలేని విధంగా తీర్పులు ఇస్తే కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయకపోతే వాటిని న్యాయ వ్యవస్థ అమలు చేయగలుగుతుందా అని కపాడియా ప్రశ్నించడంలో ఎంతో వివేచన కనిపిస్తుంది. న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా ఉండడం కొంతవరకు ఆమోదయోగ్యమేకాని, అచ్చంగా న్యాయ వ్యవస్థే ప్రభుత్వాన్ని శాసించాలని అనుకోవడం సరికాదు. ప్రభుత్వంలో జరిగే తప్పులు, ఒప్పులపై తీర్పులు ఇవ్వవచ్చు కాని, విధానాలలో జోక్యం చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇటీవలికాలంలో కొందరు న్యాయమూర్తులు కొన్ని ప్రభావాలకు లోనై తీర్పులు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు. ఒకే తరహా కేసులలో న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇస్తుండడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు మాజీ ఛీఫ్ జస్టిస్ కక్రు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ కు వ్యతిరేకంగా సిబిఐ దర్యాప్తు జరపాలని ఇచ్చి తీర్పు విమర్శలకు గురి అవుతోంది.అలాగే చంద్రబాబునాయుడు తదితరులకు వ్యతిరేకంగా మరో ఛీప్ జస్టిస్ గులాం ఇచ్చిన తీర్పు కూడా విమర్శలకు గురి అయింది.ఇక మన రాష్ట్రంలో గాలి జనార్దనరెడ్డి బెయిల్ ముడుపుల కేసు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించేదిగా మారింది.న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా తీర్పులు ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ నేపధ్యంలో ఛీఫ్ జస్టిస్ కపాడియా చేసిన వ్యాఖ్యలు అందరూ అనుసరించదగినవని చెప్పాలి.
SOURCE: KOMMINENI
SOURCE: KOMMINENI
వైఎస్సార్ సీపీలో 200 మంది చేరిక
ఆలమూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడిలో టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన 200 మంది కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కొల్లి నిర్మలకుమారి, చర్ల జగ్గిరెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అసలు ప్రభుత్వం ఉందా?: విజయమ్మ
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
కిరణ్ సర్కారు ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదన్నారు. రైతులకు భరోసా లేదని, రైతు కార్మికులకు ఉపాధి లేక వలసపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అన్నదాత పంట విరామం ప్రకటించినా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలిపారు. ఇరవై లక్షల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. సర్ చార్జీలంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీ అయిందని వాపోయారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళంలో పడిపోయారన్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదన్నారు.
అధికార, విపక్షాలు కుమ్మక్కై జగన్ ను టార్గెట్ చేశాయని అన్నారు. జగన్ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. లేని మహానేతపై కొంతమంది మంత్రులు బురద చల్లుతున్నారని అన్నారు. వైఎస్సార్ తిరిగొస్తే ఆయన కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం ఈ మంత్రులకు ఉందా? అని విజయమ్మ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు. ప్రతి సమస్యపై పోరాడాల్సిన అవసరముందని అన్నారు. మళ్లీ వైఎస్సార్ సువర్ణయగం వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. తమ పార్టీలో చేరిన హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులను ఆమె అభినందించారు.

ఉచిత విద్యుత్ ఎందుకివ్వరు?: శోభ
కర్నూలు: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 7 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చారు, కిరణ్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. కిరణ్‌ను తొలగించడానికి మంత్రులు, మంత్రులను తొలగించడానికి కిరణ్ హైదరాబాద్- ఢిల్లీ టూర్లు చేస్తున్నారు తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.
గ్యాస్, బొగ్గు నిల్వలను ప్రైవేట్ సంస్థలకిచ్చి కరెంట్ కోసం కేంద్రాన్ని అడుక్కుంటు..
నల్గొండ: తెలంగాణపై ప్రజలను కాంగ్రెస్, టీడీపీ మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ ఎక్కువ ఉంటే సీఎం కిరణ్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గ్యాస్, బొగ్గు నిల్వలను ప్రైవేట్ సంస్థలకిచ్చి కరెంట్ కోసం కేంద్రాన్ని అడుక్కుంటున్నారని ఘాటుగా విమర్శించారు. 9 గంటలకు కరెంట్ ఇస్తామని, ఇప్పుడు 3 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు.
ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సన్మానం
జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా టీచర్స్ ఫెడరేషన్ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జంగారెడ్డిగూడెంలో రోటరీ కమ్యూనిటీహాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేత, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే.ఓబులాపతి, జిల్లా కన్వీనర్ విజే కెనడీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు చిగురుపాటి సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
'సబ్‌ప్లాన్‌పై నివేదిక కంటితుడుపు చర్య'
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక కేవలం కంటితుడుపు చర్యేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జూపూడి ప్రభాకర్, మారెప్ప, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మంత్రులు ఇచ్చిన నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని విమర్శించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కూడా నియమించని ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని దళితులు ఎలా నమ్ముతారని వారు ప్రశ్నించారు. దళితులు వైఎస్‌ఆర్‌సీపీకి వెళ్తున్నారనే తూతూ మంత్రం నివేదికను ప్రభుత్వం తీసుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై వెంటనే అసెంబ్లీ కౌన్సిల్ సమావేశ పరచాలని వారు డిమాండ్ చేశారు.
జవహర్‌నగర్‌కు బయలుదేరిన విజయమ్మ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌కు బయలుదేరారు. జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిస్తారు. తర్వాత జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇదే కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వైస్సార్ సీపీలో చేరనున్నారు. మరోవైపు గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ తొలిసారిగా రంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నారు.
31న రాష్ట్రబంద్‌కు వైఎస్సార్ సీపీ పిలుపు
అస్తవ్యస్త విద్యుత్ కోతలను నిరసిస్తూ ఈనెల 31న రాష్ట్రవ్యాప్త బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈనెల 28, 29, 30 తేదీల్లో మండలస్థాయి నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపింది. విద్యుత్ కోతల నుంచి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను కాపాడాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. కరెంట్ కోతలను తగ్గించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించింది.
రాయలసీమవాసుల గర్జన
గ్రేటర్ హైదరాబాద్ లో ఈరోజు రాయలసీమవాసులు గర్జించారు. విభజన అనివార్యమైతే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, భూమన్, డాక్టర్ రమణా రెడ్డిలు ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాయలసీమ ఆవశ్యకతపై చర్చించారు. సమావేశంలో పలువురు చాలా ఆవేశంగా ప్రసంగించారు. రాయలసీమ వెనుకబాటు తనాన్ని ఎత్తిచూపారు. తెలంగాణవాది దిలీప్ సమావేశంలో పాల్గొని రాయలసీమ ఏర్పాటు ఉద్యమానికి మద్దతుపలికారు.
సమావేశంలో వక్తల అభిప్రాయాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
1. రాయలసీమ జెఎసి ఏర్పాటు చేయాలి.
2. ప్రత్యేక రాయలసీమ సైనిక రెజిమెంట్ ఏర్పాటు చేయాలి.
3. రాయలసీమకు మౌలిక వసతులు పెంచాలి.
4.సీమలో ప్రతి ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరందించాలి.
5. తెలుగుగంగ ప్రాజెక్టుకు అదనంగా 32 టిఎంసిల నీటిని కేటాయించాలి.
6. అనంతపురంలో స్పైస్ సిటీ ఏర్పాటు చేయాలి.
7. మదనపల్లిలో ఐటి పార్క్ ఏర్పాటు చేయాలి.
8. జిల్లాల పునర్విభజన చేసి రాయలసీమలో 9 జిల్లాలు ఏర్పాటు చేయాలి.
కొత్తగా తిరుపతి, నంద్యాల, ప్రొద్దుటూరు, గుంతకల్, హిందూపూర్ జిల్లాలు ఏర్పాటు చేయాలి.
9. తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలి.
10. జనాభా ప్రాతిపదికన రెండు లక్షల 64వేల ఉద్యోగాలు ఇవ్వాలి.
11. సీమలో భూగర్భ జలాలు అడుగంటినందున వంద శాతం మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి.
12. బెంగళూరు-మదనపల్లి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి.
ప్రత్యేక రాయలసీమ కోసం 40 రోజులపాటు 800 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ లో రాయలసీమపై ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన చాలా ఆవేశంగా ప్రసంగించారు. సీమలోని ప్రతి గ్రామానికి వెళతానని చెప్పారు. సీమకు అన్నిరంగాలలో అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమవాసులను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. తమ ఆత్మగౌరంజోలికి వస్తే సహించేదిలేదని హెచ్చరించారు. త్యాగానికి మారుపేరు రాయలసీమవాసులని చెప్పారు. రాయలసీమ త్యాగం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. తమ ప్రాంతం పేదరికంలో మగ్గుతున్నాం భరిచామన్నారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి సహకరించని నేతలందరూ తెలంగాణలో తలదాచుకోవలసిందేనని హెచ్చరించారు

Subscribe to:
Posts (Atom)