సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ కపాడియా అధ్బుత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు దేశాన్ని పాలిస్తున్నామనో, పాలించాలనో అనుకోరాదని, పద్దతిగా తీర్పులు ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేయలేని విధంగా తీర్పులు ఇస్తే కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయకపోతే వాటిని న్యాయ వ్యవస్థ అమలు చేయగలుగుతుందా అని కపాడియా ప్రశ్నించడంలో ఎంతో వివేచన కనిపిస్తుంది. న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా ఉండడం కొంతవరకు ఆమోదయోగ్యమేకాని, అచ్చంగా న్యాయ వ్యవస్థే ప్రభుత్వాన్ని శాసించాలని అనుకోవడం సరికాదు. ప్రభుత్వంలో జరిగే తప్పులు, ఒప్పులపై తీర్పులు ఇవ్వవచ్చు కాని, విధానాలలో జోక్యం చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఇటీవలికాలంలో కొందరు న్యాయమూర్తులు కొన్ని ప్రభావాలకు లోనై తీర్పులు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు. ఒకే తరహా కేసులలో న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇస్తుండడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు మాజీ ఛీఫ్ జస్టిస్ కక్రు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ కు వ్యతిరేకంగా సిబిఐ దర్యాప్తు జరపాలని ఇచ్చి తీర్పు విమర్శలకు గురి అవుతోంది.అలాగే చంద్రబాబునాయుడు తదితరులకు వ్యతిరేకంగా మరో ఛీప్ జస్టిస్ గులాం ఇచ్చిన తీర్పు కూడా విమర్శలకు గురి అయింది.ఇక మన రాష్ట్రంలో గాలి జనార్దనరెడ్డి బెయిల్ ముడుపుల కేసు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించేదిగా మారింది.న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా తీర్పులు ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ నేపధ్యంలో ఛీఫ్ జస్టిస్ కపాడియా చేసిన వ్యాఖ్యలు అందరూ అనుసరించదగినవని చెప్పాలి.
SOURCE: KOMMINENI
SOURCE: KOMMINENI
No comments:
Post a Comment