YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 12 July 2012

YSRCP Leader Jupudi Prabhakar Rao Fire On Congress Government

బాబును ప్రజలు నమ్మడం లేదు: బాజిరెడ్డి

చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే బీసీలకు 100 సీట్లు.. రూ.10 వేల కోట్లని బాబు మభ్యపెడుతున్నారని బాజిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మొసలి కన్నీటిని ఎవరూ నమ్మొద్దని బాజిరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు హైటెక్ విధానాలను అవలంబించారని, రైతులను విస్మరించారని ఆయన అన్నారు. బీసీలకు వైఎస్ఆర్ కేటాయించినన్ని నిధులు ..దేశంలో ఏ సీఎం అయినా ఇచ్చారా అని బాజిరెడ్డి ప్రశ్నించారు.

జగన్ ను కలిసిన ఎన్ పీపీ అధ్యక్షుడు

జమ్మూ కాశ్మీర్ కు చెందిన నేషనల్ పాంథర్స్ పార్టీ(ఎన్ పీపీ) అధ్యక్షుడు బల్వంత్‌సింగ్ మన్‌కోటియా, చైర్మన్ ప్రొఫెసర్ భీమ్‌సింగ్ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలో సంగ్మాకు మద్దతు ఇవ్వాలని జగన్ ను వారు కోరారు.

YS Vijayamma to start Chenetha dharna on 23rd july in Sirisilla

సమస్యలతో సతమతమవుతున్న చేనేత కార్మికుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోరుబాట పట్టనున్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆమె ఈనెల 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఒకరోజు ధర్నా చేపట్టనున్నారు. నేతన్న కష్టాలు, సమస్యలను విజయమ్మ ప్రభుత్వం దృష్టికి వెళ్లనున్నారు.



Uppuleti Kalpana Meet To YS Vijayamma


టీడీపీ పాలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు ఉదయం ఆమె చంచల్‌గూడ జైలులో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. విజయమ్మతో కొద్ది సేపు సమావేశమైన అనంతరం నివాసం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమై పార్టీలో చేరే విషయాన్ని వెల్లడిస్తానని వివరించారు. నెల్లూరు ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డికి మాతృ వియోగం సంభవిస్తే ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా పరామర్శించడానికి ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసిన కొద్ది సేపట్లోనే తనను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ప్రకటించడం అన్యాయం, దారుణం అనీ దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాననీ కల్పన తెలిపారు.

పార్టీ నుంచి తనను బహిష్కరించి నందుకే జగన్ వైపు నిలబడాలనే ఉద్దేశ్యంతో విజయమ్మను కలిశానని పేర్కొన్నారు. టీడీపీలో దళితులు, బడుగు బలహీనవర్గాలకు స్థానం లేదనీ అక్కడ అగ్రకులాలకు ఓ న్యాయం, దళితులకు మరొక న్యాయం జరుగుతోందని విమర్శించారు. తనను టీడీపీ నుంచి బలవంతంగా బయటకు పంపారనీ ఇపుడు స్వతంత్రురాలిననీ తనపై ఎలాంటి ఆంక్షలు లేవు కనుక జైలులో జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆ తరువాత విజయమ్మను కలిశానని తెలిపారు. వాస్తవానికి తన నియోజకవర్గ కార్యకర్తలు ఏడాది నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఒత్తిడి తెస్తున్నారనీ వారి అభీష్టానుసారం నడుచుకుంటానని అన్నారు.

‘విజయవాడలో వల్లభనేని వంశీ జగన్‌ను రోడ్డుపై కలిస్తే ఏమీ చేయలేదు...రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జగన్‌తో మంతనాలు జరిపితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతెందుకు బాబు తానే స్వయంగా చిదంబరంను ఎవరికీ తెలియకుండా కలిశారు. మొన్న ప్రణబ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కానీ నేను రాజమోహన్ రెడ్డిని కలిసినందుకే ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’ అని ఆమె అన్నారు. సామాజిక సమతౌల్యం కోసమే తనను పాలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు తప్ప కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు బాబు తమ సూచనలు, సలహాలు తీసుకున్నది లేదని ఆమె అన్నారు.

తాను 2004లో పార్టీలో చేరి ఎనిమిదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాననీ డబ్బు, సమయం వృథా చేసుకున్నానని ఆమె వెల్లడించారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇస్తానని బాహాటంగా చెప్పే చంద్రబాబు ఆచరణలో అది చేయరని అన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు వచ్చినపుడు కోట్లు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయో వారికే ఇచ్చారనీ పదవులను బాబు వేలం వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్యాకేజీలు ఇస్తున్నందునే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని బాబు చేస్తున్న విమర్శలన్నీ కట్టుకథలనీ జగన్ వెంట జనం ఉన్నారు కనుకనే అందరూ వస్తున్నారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికోట్లు ఇస్తే జగన్ మాదిరిగా ప్రజాభిమానం పొందగలరని ఆమె అన్నారు.

కల్పనతో పాటుగా విజయమ్మను కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కృష్ణా జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, జిల్లా అధికార ప్రతినిధి ముత్తారెడ్డి ఉన్నారు.

టీడీపీలో దళితులకు చోటులేదు: ఉప్పులేటి

తెలుగుదేశం పార్టీలో దళితులకు చోటు లేదని ఆపార్టీ నుంచి సస్పెండ్ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. బాబు హయాంలో పార్టీకి దళితులు, మైనార్టీ, బీసీలు దూరం అవుతున్నారని ఆమె గురువారమిక్కడ అన్నారు. కుట్ర చేసి తనను పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపారని కల్పన ఆరోపించారు.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అని చెప్పుకోవటం కోసమే పార్టీలో తమలాంటి దళితులకు పదవులు ఇచ్చారన్నారు. తనను బయటకు పంపటం దళితులను అవమానపరచటమేనని కల్పన వ్యాఖ్యానించారు.

తాను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించటానికే కలిశానని, ఆ కారణానికే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం దారుణమన్నారు. వివరణ కోరకుండా సస్పెండ్ ఎలా చేస్తారని కల్పన ప్రశ్నించారు. అగ్రకులాలకు ఓ న్యాయం, దళితులకు ఓ న్యాయమా అని నిలదీశారు. బాబు ఏనాడు పొలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయాలను అమలు చేయలేదన్నారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటిస్తానని కల్పన తెలిపారు. జగన్ వెంట ప్రజలు, ప్రజాభిమానం ఉందని ఆమె అన్నారు.

విజయమ్మను కలిసిన ఉప్పులేటి కల్పన

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో భేటీ అయ్యారు. విజయమ్మను మర్యాద పూర్వకంగానే కలిసినట్లు ఆమె చెప్పారు. అంతకు ముందు కల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో కలిశారు.

Court rejected CBI charge sheet

Wednesday, 11 July 2012

జగన్ కేసులో అనుబంధ ఛార్జీషీట్ తిరస్కరణ

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అనుబంధ ఛార్జీషీట్ ను సిబిఐ కోర్టు తిరస్కరించింది.ఛార్జీ షీట్ లో తప్పులు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.గతంలో కూడా సిబిఐ ఎమ్.ఆర్., ఒఎమ్సీ కేసులలో కూడా ఛార్జీషీట్లను కోర్టు తిప్పి పంపి మరోసారి వేయించింది. ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది.ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సిబిఐ కేసులలో ఇలా జరగడం ఆ సంస్థకు అప్రతిష్టగానే భావిస్తున్నారు. నాలుగు కంపెనీల పేర్లను నిందితులుగా చేర్చారని, కాని కంపెనీల ప్రతినిదుల పేర్లను చేర్చకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. కొన్ని సాంకేతిక లోటుపాట్లు ఉన్నాయని, పూర్తిగా సవరించి పంపాలని కోర్టు ఆదేశించింది.


source:kommineni

జగన్ను కలిసిన ఉప్పులేటి కల్పన

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలుసుకున్నారు. ఆమెతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను కూడా జగన్ ను కలిసినవారిలో ఉన్నారు.

'ముఖ్యమంత్రి వ్యాఖ్యలు శుద్ధ తప్పు'

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హైకోర్టు విచారిస్తున్న కేసుల్లో ప్రభుత్వం పార్టీగా లేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు శుద్ధ తప్పని సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షి హెడ్ లైన్ షోలో మాట్లాడుతూ ఈ కేసులో తొలి ప్రతివాది ప్రభుత్వమేనన్నారు. హైకోర్టు ఈ కేసు దర్యాప్తుకు ఆదేశించకముందే ప్రభుత్వం నుంచి వివరణ కోరిందని సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు.

సర్కార్ నిర్ణయాలే ఆ జీవోలని ప్రభుత్వం అప్పుడే చెప్పి ఉంటే అసలు దర్యాప్తే ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, మంత్రులకు న్యాయ సహాయం అందిస్తున్న నేపథ్యంలో జారీ చేసిన 26జీవోలు సక్రమేనని రుజువు చేసినట్లు అన్నారు. 26 జీవోలు సక్రమమే అయితే అసలు జగన్ పై కేసే లేదని సుధాకర్ రెడ్డి అన్నారు.

Sakshi Vedika with YSRCP Leader kolli Nirmala Kumari

బీసీలను విస్మరించినందునే టీడీపీ ఓటమి : ఆర్.కృష్ణయ్య

 అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పూర్తిగా విస్మరించినందునే 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలు కావాల్సివచ్చిందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హితవు పలికారు. ఇప్పుడు బీసీలకు ఏదో చేస్తామని చెప్పడంకన్నా.. గతాన్ని పునరావృతం కానివ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని టీడీపీ నేతల్ని ఆయన డిమాండ్ చేశారు. ‘సాక్షి’ టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన బుధవారం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామన్న qటీడీపీ ప్రకటన పట్ల పై విధంగా స్పందించారు.

1996లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల పేరుతో తీర్మానం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత కేంద్రంపై ఎలాంటి ఒత్తిడీ చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున బీసీలకు వంద సీట్లు ఇస్తామంటూ వరంగల్ సభలో చేసిన డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కరడుగట్టిన బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోన్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు ఎందుకు పోరాటాలు చేయలేదని నిలదీశారు. గతంలో ఉన్న ఫీజుల్ని కూడా బీసీ విద్యార్థులకు చంద్రబాబు కొనసాగించలేకపోయారని, జిల్లాకో కళాశాల హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పి చేయలేదని ఆరోపించారు. ఇవన్నీ టీడీపీ నేతలను విమర్శించేందుకు కాదని, ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని చెపుతున్నానని ఆయన చెప్పారు. 


చెప్పడం కాదు.. ఆచరణలో పెట్టండి.. 
ఇదిలా ఉండగా కృష్ణయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు వందసీట్లు ఇస్తామని ప్రకటించిన టీడీపీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దీన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. టీడీపీ ఇచ్చిన బీసీల డిక్లరేషన్‌లో స్పష్టత లేదన్నారు. జాతీయస్థాయిలో చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకోసం అన్నిపార్టీలూ కృషిచేయాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని, ప్రతి బీసీ కుటుంబానికి ఐదు నుంచి 50 లక్షల వరకు రుణాలివ్వాలని కోరారు.

26 జీవోలు సరైనవేనంటున్న సర్కారు


దర్యాప్తుకు ఆదేశించక ముందే సర్కారుకు హైకోర్టు నోటీసులు
అప్పుడు మాత్రం మౌనంగా ఊరుకున్న రాష్ర్ట ప్రభుత్వం
అప్పుడే ఈ సమాధానం చెప్పి ఉంటే ఈ దర్యాప్తే ఉండేది కాదేమో!
అందుకే నాడు ఊరుకుని... నేడు మంత్రుల కోసం ఈ వైఖరి

హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కొందరు పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, అందుకు ప్రతిఫలంగానే వారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది.. సీబీఐ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన పిటిషన్ ఆధారంగా దీనిపైనే అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కక్రూ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ.. ప్రభుత్వ నిర్ణయాల జోలికి పోలేదు. సీబీఐ దర్యాప్తు మొత్తం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సంస్థలు, వాటిలోని ఇన్వెస్టర్ల చుట్టూనే తిరుగుతుండటంతో నెల్లూరుకు చెందిన పి.సుధాకరరెడ్డి అనే న్యాయవాది దీనికి అభ్యంతరం చెప్తూ కేసు వేశారు. ‘‘ప్రభుత్వం కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటంతో వారు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. అంటే ముందు ప్రభుత్వం కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందా? లేక అంతా నిబంధనల ప్రకారమే జరిగిందా? అన్నది తేలాలి. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సరైనవో కావో తేల్చాలి. అవేమీ తేల్చకుండా దర్యాప్తు మొత్తం జగన్ చుట్టూనే తిరుగుతుండటం పక్షపాతాన్ని కళ్లకు కడుతోంది. దయచేసి నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించండి’’ అంటూ సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని సీబీఐ కోర్టు కొట్టివేయటంతో న్యాయవాది సుధాకరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా పిటిషన్‌ను తిరస్కరించటంతో చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు. 

సుప్రీంకోర్టు దీనిపై స్పందించి ఆ జీవోలు జారీ చేసిన ఆరుగురు మంత్రులకు, కొందరు ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అలా నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణ మినహా మిగిలిన ఐదుగురు మంత్రులకూ న్యాయ సహాయం అందజేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీన్ని సమర్థించుకుంటూ... ‘‘వారు తప్పు చేశారని నేననుకోవటం లేదు. ఆ జీవోలు ప్రభుత్వం ఇచ్చినవి. అవి ప్రభుత్వ నిర్ణయాలు కాబట్టే సాయం అందిస్తున్నాం. అయితే క్విడ్ ప్రో కోలతో మంత్రులకు సంబంధం ఉందనుకోవటంలేదు’’ అని ముఖ్యమంత్రి బుధవారం వ్యాఖ్యానించారు. నిజానికి ఈ కేసులో దర్యాప్తునకు ఆదేశించకముందు ప్రభుత్వం వైఖరేమిటో చెప్పాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది కూడా. ప్రభుత్వం గనక తమ నిర్ణయాలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని, తప్పేమీ లేదని చెప్పి ఉంటే.. బహుశా ఈ విచారణ, ఈ దర్యాప్తు ఇవన్నీ ఉండేవి కావేమో! కానీ ప్రభుత్వం అప్పట్లో తన వైఖరిని కోర్టుకు చెప్పలేదు. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ కక్రూ తన తీర్పులోని 41వ పేరాలో ప్రస్తావిస్తూ.. అన్ని కేసుల మాదిరిగానే ఈ కేసులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చామని, కానీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకూడదని భావించినట్లుందని వ్యాఖ్యానించారు. రికార్డులు కూడా అందజేయలేదని, అలాంటపుడు తగిన విధంగా అర్థం చేసుకోవటం తప్ప ఈ కోర్టు చేయగలిగిందేమీ లేదని అన్నారు. 

ప్రభుత్వం చేత బలవంతంగా అఫిడవిట్ వేయించలేమని కూడా స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కనక, రికార్డులు ఇవ్వలేదు కనక పిటిషనర్ కోరినట్టు దర్యాప్తునకు ఆదేశించలేమని చెప్పలేం. మా ముందున్న మిగిలిన ఆధారాలు, ఇతర అంశాల ఆధారంగా నిర్ణయానికి రావాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కానీ బుధవారం నాడు సీఎం మాత్రం.. ‘‘ఆ కేసులో ప్రభుత్వం పార్టీ కాదు. అందుకే మేం కోర్టుకు సమాధానం చెప్పలేదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. చివరికి కోర్టు తన తీర్పులో సైతం.. ప్రతివాదుల జాబితాలో మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వాన్నే పేర్కొంది. దాని ప్రతినిధిగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని పేర్కొంది. ప్రభుత్వం మాత్రం తాను భాగస్వామిని కాదని చె ప్పటం గమనార్హం.

సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు

చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్
నియంతలా సంజాయిషీ కూడా అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తావ్?
నాపై సస్పెన్షన్ ఎత్తివేసి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకెళతా
నాడు నీ స్వార్థం కోసం ఎన్టీఆర్‌ను గెంటేశావ్
ఇప్పుడు నీ కొడుకు కోసం నాలాంటి ఎన్టీఆర్ అభిమానులను గెంటేస్తున్నావ్
టీడీపీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేసిన నువ్వు అతిపెద్ద అవినీతిపరుడివి
ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని, హోంమంత్రి చిదంబరాన్ని ముసుగేసుకుని కలిశావ్
రూ. 300 కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్మేశావ్
గాలి జనార్ధనరెడ్డిపై ఆరోపణలు చేయడానికి రూ.300 కోట్లు తీసుకున్నావ్
చంద్రబాబు ఉంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదు

గుడివాడ (కృష్ణా), న్యూస్‌లైన్: ‘‘పార్టీ నీ బాబు సొత్తా.. నీ ఇష్టం వచ్చినట్లు నియంతలా వ్యవహరిస్తున్నావు.. నాడు నీ స్వార్థం కోసం అన్న ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి గెంటేశావు.. నేడు నీ కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న నాలాంటివారిని పార్టీ నుంచి గెంటేస్తున్నావు.. నేనేం తప్పు చేశానని గెంటేశావు? తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేస్తున్న అతిపెద్ద అవినీతిపరుడివి నువ్వు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ధ్వజమెత్తారు. కుళ్లు రాజకీయాలు, వెన్నుపోట్లు, కుతంత్రాలు, కుట్రలు, స్వార్థ రాజకీయాలు చంద్రబాబుకు పేటెంటు హక్కు అని, అవి ఇంకెవరికీ చెందవని అన్నారు. పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేసిన 
తనను చంద్రబాబు, ఆయన అనుచరులు బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీలో చేర్చుకోవాలని.. లేకుంటే కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. గుడివాడలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

వ్యక్తిగత స్వేచ్ఛలేదా?

‘‘నాకు పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? మీరు కాంగ్రెస్ వాళ్ల ఇంటికి వెళ్లొచ్చా.. అవేమో వ్యక్తిగత సంబంధాలా? నేను వెళితే తప్పా? వ్యక్తిగత సంబంధాల మేరకు నేను వైఎస్ జగన్‌ను పరామర్శించడానికి వెళదామనుకున్నా. అలా వెళితే నువ్వు పిల్ల చచ్చిన కోతిలాఏడుస్తావని ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయమ్మను కలిసి మాట్లాడాను. అలా కలిసి బయటకు వచ్చేటప్పటికే.. రెండు నిమిషాల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటించారు. వ్యక్తులతో మాట్లాడినంత మాత్రాన సస్పెండ్ చేయడమేనా? అధినేత అనేవాడు పిలిచి మాట్లాడాలి. నా సంజాయిషీ కోరాలి.. కనీసం నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న నాలాంటివారిని బయటకు గెంటేయాలనే కుట్రతోనే ఇలా చేశారు. సస్పెండ్ చేసిన వెంటనే హైదరాబాద్ కార్యాలయంలో చంద్రబాబు.. తన భజనపరులుగా ఉన్న జిల్లాకు చెందిన నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నన్ను రకరకాలుగా తిట్టించారు. రాజకీయ వ్యభిచారినని.. డబ్బుకు అమ్ముడుపోయానని, పార్టీకి ద్రోహం చేశానని.. రాళ్లతో కొట్టాలని ఊరకుక్కలతో మొరిగించారు. నేనేం తప్పు చేశానని రాళ్లతో కొడతారు? ఎందుకు సస్పెండ్ చేశావు? అయినప్పటికీ చంద్రబాబు తన తప్పు తెలుసుకుని మారతాడనుకుని మీడియావారికి కూడా రెండు రోజులు కనిపించకుండా ఉన్నాను. రెండో రోజు కూడా జిల్లాకు చెందిన బీసీ ఎంపీతో గుడివాడలో సమావేశం ఏర్పాటుచేసి తిట్టించారు. సాయంత్రం చంద్రబాబే నేరుగా దాడికి దిగారు. అందుకే నేడు మాట్లాడాల్సివస్తోంది’’ అని నాని అన్నారు.

ఇంకా అధ్యక్షుడిగా ఉండడానికి సిగ్గులేదా?

‘‘గుడివాడ నియోజకవర్గం ప్రజలు నన్ను రాళ్లు, చెప్పులతో కొట్టాలని చెప్పిన నీకు(చంద్రబాబు) ఏమాత్రం సిగ్గులేదు. నిన్ను చంద్రగిరిలో తరిమేస్తే పారిపోయి కుప్పంలో తలదాచుకున్నవాడివి.. ప్రజాస్వామ్యంలో రాళ్లు, చెప్పులతో కొట్టనవసరం లేదు.. డిపాజిట్లు రాకుండా చేస్తే అదే తిరస్కరించడం. ఇటీవల దాదాపు 60 చోట్ల పోటీచేస్తే.. సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు. మొన్న జరిగిన 18 నియోజకవర్గాల ఉపఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారు. అయినా సిగ్గులేకుండా ఇంకా నువ్వు పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నావ్. నువ్వు దౌర్భాగ్యుడివని తెలిసినా.. అన్న ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఇంకా పార్టీలో కొనసాగుతున్నాం.. కానీ అన్న కుటుంబాన్ని అభిమానించేవారందరినీ నువ్వు బయటకు పంపేస్తున్నావ్’’ అని నాని విమర్శించారు.

జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ చేసి నాకు సీటు ఇప్పించారు

‘‘నేనేమీ నీ దయా దాక్షిణ్యం వల్ల రాజకీయాల్లోకి రాలేదు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే నాకు ఎనలేని అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ చేసి నాకు రెండుసార్లు టికెట్ ఇప్పించారు. ఎక్కడా లేని విధంగా పార్టీని మున్సిపాల్టీలో గెలిపించాను. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల్లో 80 శాతం గెలిపించాను. కానీ నీవు.. నీ కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేదు. నీపై పోటీ చేసిన వ్యక్తి జెడ్పీ చైర్మన్ అయ్యాడు. ఇది నిజంకాదా? నీలా కుళ్లు, కుతంత్రాలు నాకు తెలియదు. నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన గల్లా అరుణకుమారి తండ్రిని వెన్నుపోటు పొడిచావు. అది మరిచిపోయావు. ప్రజలు రాళ్లు, చెప్పులతో నన్ను కొట్టాలని చెప్పావు.. కానీ నిన్ను రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొట్టకుండా చూసుకో.. నువ్వుండగా నీ పార్టీ రాష్ట్రంలో గెలవదు. గుడివాడలో పోటీచేద్దాం.. రా.. నీ పార్టీ గెలుస్తుందో, నేను గెలుస్తానో చూద్దాం...’’ అని నాని సవాలు విసిరారు.

మరణించిన వ్యక్తిపై నిందలు తగదు..

‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక ఆయనపై నిందలు వేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. చిన్నకుర్రాడు జగన్‌పై అవినీతి ఆరోపణలు ప్రచారం చేశావు. కానీ జనం నీ మాటలు నమ్మలేదు. నువ్వు దొంగవని నమ్ముతున్నారు. చనిపోయిన వ్యక్తిని తిట్టే సంస్కృతి మనది కాదు. అయినా రాజశేఖరరెడ్డిని అవినీతిపరుడని చనిపోయాక దూషించావు. నాకు జగన్‌తో వ్యక్తిగత పరిచయాలున్నాయి. ఆయన్ను నాలుగైదుసార్లు కలిశాను. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచి పరిచయాలున్నాయి. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉంది. అలాగే వైఎస్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. వైఎస్‌ను పేదలు దేవుడిగా కొలుస్తున్నారు. గుడివాడలో పేద ప్రజలకు ఇళ్లస్థలాలు కావాలని అడిగితే వైఎస్ 100 ఎకరాలు భూసేకరణ చేశారు..’’ అని నాని చంద్రబాబుకు గుర్తు చేశారు.

సోనియాకు పార్టీని తాకట్టు పెట్టావు..

‘‘అన్న ఎన్టీఆర్ బడుగు, బలహీనవర్గాల వారికోసం పార్టీని పెట్టారు.. నీలాంటి పందికొక్కుల కోసం కాదు. నువ్వేమో టీడీపీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేశావు.. సోనియా, చిదంబరంలను ముసుగేసుకుని కలుస్తున్నావు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది వాస్తవం కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? నేను రూ. 30 కోట్లకు అమ్ముడుపోయానని చెప్పించావు. నీవు రాజ్యసభ సీట్లను రూ. 300 కోట్లకు అమ్మేశావు. గాలి జనార్దనరెడ్డిని అల్లరి చేయటానికి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వద్ద రూ.300 కోట్లు తీసుకున్నావు. అవినీతిపరుడివి నువ్వా... నేనా? రూ.100 నుంచి వందల కోట్ల వరకు అవినీతికి పాల్పడేది నువ్వే. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. నీ విషపు రాజకీయాలకు నీతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు బలయ్యాయి..’ అంటూ నాని చంద్రబాబుపై మండిపడ్డారు.

బాబుపైనే నా రాజకీయ భవితవ్యం..

తన రాజకీయ భవితవ్యం చంద్రబాబుపైనే ఆధారపడి ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి రాజకీయంగా తనను ముంచుతాడో, సస్పెన్షన్ అలాగే ఉంచి తనకు రాజకీయ భవిష్యత్‌ను ఇస్తాడో తేల్చాలని వ్యంగ్యంగా అన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం నిర్ణయిస్తానని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్ పార్టీలోకి రమ్మంటే వెళతానన్నారు. అయితే తనపై పార్టీ సస్పెన్షన్ ఎత్తకపోతేనేనని చెప్పారు. జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉంటే, ఆయన్ను పరామర్శించడానికి ఎలా వెళ్లారని విలేకరులు నానిని ప్రశ్నించగా, ‘‘జగన్ చాలా మంచివారు. ఆయనపై లేనిపోని అభియోగాలు మోపి కేసుల్లో ఇరికించారు. అవన్నీ కోర్టులో త్వరలోనే తేలతాయి. నేను పార్టీ మారాలనుకుంటే వైఎస్ ఉన్నప్పుడే వెళ్లేవాడిని’’ అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ముద్ర చెరిపేద్దాం..!


ఆయన పురిటి గడ్డలోనే శ్రీకారం చుట్టిన బాబు 
‘నందమూరి ’ అభిమానులను సాగనంపుతున్న వైనం
నానితో బోణి... లైన్లో వంశీ 
మనస్తాపం చెందుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు



విజయవాడ, న్యూస్‌లైన్‌ప్రతినిధి: తెలుగుదేశంపై ఎన్టీఆర్ ముద్రను ఆయన పురిటిగడ్డలోనే చెరిపే ప్రయత్నాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. పార్టీ అధ్యక్షునిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) సస్పెన్షన్ వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఈ వాస్తవాల్నే రుజువు చేస్తున్నాయి. పార్టీ అధినేత ధోరణి వల్లే ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌లు ఆ పార్టీతో ఎప్పటినుంచో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా రు. వీరికి సన్నిహితంగా మెలుగుతున్న విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిల పట్ల కూడా చంద్రబాబు చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు పార్టీ నేతలు ప్రస్తుతం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించేందుకు కూడా భయపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు.

వ్యూహాత్మకంగా వంశీకి ఎంపీ టికెట్...
ఇలా తన వ్యూహాలను అమలు పరిచే చర్యల్లో భాగంగానే చంద్రబాబు 2009 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం శాసనసభ స్థానం టికెట్ ఆశించిన వల్లభనేని వంశీకి విజయవాడ పార్లమెంట్ సీటును ఒక పథకం ప్రకారం అంటగట్టారనే అభిప్రాయం లేకపోలేదు. దాదాపు అయిదేళ్లు గన్నవరం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమైన వంశీ ఆ ఎన్నికల్లో స్వతంత్రునిగా పోటీచేసినా విజయం సాధించడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అంచనావేశారు. 


పముఖ పారిశ్రామికవేత్త దాసరి జయరమేష్ సోదరుడు బాలవర్ధనరావుకు ఆ సీటును కేటాయించి అక్కడి నుంచి వంశీని తప్పించేందుకు బాబు తెరచాటు వ్యవహారం నెరిపినట్టు ఆరోపణలొచ్చాయి. సీటు రాకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి వంశీ సిద్ధంగా ఉండటంతో విజయవాడ పార్లమెంటు స్థానంలో టికెట్ ఇచ్చారు. ఎన్నికలకు పదిహేను రోజులు ముందు సీటు కేటాయించడంతో వంశీ ప్రచారం కోసం పార్టీ నేతలపైనే ఆధారపడ్డారు. అధినేత మనసు తెలుసుకున్న కొందరు వంశీ ఇచ్చిన సొమ్మును వాడుకుని ఓటమికి కారకులయ్యారని అప్పట్లో ఆ పార్టీలోనే ప్రచారం జరిగింది. 



అర్బన్ అధ్యక్షునిగా అవమానాలెన్నో...: అర్బన్ అధ్యక్షునిగా వంశీ అనేక అవమానాలకు గురయ్యారు. ఆ యనకు తెలియకుండా రాష్ట్ర నేతలు విజయవాడ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా ఆహ్వానం మేరకు వారు విజయవాడ రావడాన్ని వంశీ వ్యతిరేకించి, అధినేతకు ఫిర్యాదు చేసినా ఫలితముండేది కాదు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ)తో నెలకొన్న విభేదాల సమయంలో పార్టీ నుంచి వంశీకి సరైన మద్ధతు కూడా లభించలేదు. కార్యకర్తల కోసం నెహ్రూతో వివాదానికి దిగిన వంశీకి జిల్లా నేతలు అండగా నిలవలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధినేత చంద్రబాబు కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో వంశీ ఆభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో పార్టీలో వంశీకి అంత సీన్‌లేదనే అభిప్రాయం ప్రచారమైంది.

హరికృష్ణ పర్యటనప్పుడే....
గతేడాది మార్చి నెలలో తెలుగుదేశం నేత హరికృష్ణ చల్లపల్లిలో పర్యటించారు. అప్పుడు కూడా ఆయనను అవమానించే రీతిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ వ్యవహరించారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబానికి ఆత్మీయులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ బాహాటంగానే ఉమాపై ఆరోపణలు సంధించారు. అధినేత దృష్టికి ఘటన వివరాలు తీసుకువెళ్లారు. ఆ తరువాత టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేళ హరికృష్ణ నగరంలోనే ఉన్నారు. ఆయనతో కార్యక్రమం చేయిద్దామని కొందరు నేతలు అడిగినా ఉమా పట్టించుకోలేదు. హరికృష్ణ పర్యటన గురించి జిల్లాలో మిగిలిన నేతలకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఆయన వ్యక్తిగత పనులపై విజయవాడ వచ్చినా కలిసేందుకు నేతలు వెనుకంజ వేశారు. 

ఈ నేపథ్యంలోనే వంశీ, నానిలు అనేకసార్లు దేవినేని ఉమ నాయకత్వం కింద తాము పనిచేయలేమని తెగేసి చెప్పారు. అయితే చంద్రబాబు ఉమామహేశ్వరరావుకే అండగా నిలిచేవారు. ఏడాదిగా విభేదాలు కొనసాగుతున్నా బాబు ఏనాడూ వారిని పిలిచి మాట్లాడే యత్నం చేయలేదు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విషయంలోనూ ఉమా వైఖరి విమర్శలకు దారి తీసింది. ఆ సినిమా విడుదల రోజున పోర్టు సాధన కోసమంటూ సమ్మెకు పిలుపు ఇవ్వడంపై కొడాలి నాని, వంశీ అభ్యంతరం చెప్పారు. 

గుడివాడలో బంద్ ఉన్నా సినిమా అన్ని షోలు వేసేటట్లు నాని చూశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టేందుకే కృష్ణాజిల్లా నేతలు ఇలా వ్యవహరించారని ఆయన అభిమానులు విమర్శించారు. ఈ సినిమా చూడొద్దంటూ ఎస్‌ఎంఎస్‌లు ఇవ్వడం కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతిసే యత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన వర్గం అండగా నిలవడం ఎన్టీఆర్ అభిమానులను క్రమంగా పార్టీకి దూరం చేసింది.

ఇలా ఎన్టీఆర్ కుటుంబీకులను పార్టీకి పూర్తి దూరంగా ఉంచి ఆయన ముద్రను క్రమేణా చెరిపే యత్నం చంద్రబాబు చేస్తున్నారని, దాన్ని కృష్ణాజిల్లా నుంచే ప్రారంభించారనే వాద నలున్నాయి. ఈ పరిణామాలు ఎన్టీఆర్ అభిమానులను కలచి వేస్తున్నాయి.

డబ్బు ఎవరు వెదజల్లుతారన్నది మొన్న కోవూరు ఉప ఎన్నికల్లోనే చూశాం



హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల విశ్వాసంతోపాటు సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని కూడా పూర్తిగా కోల్పోయారని, అందుకే కొందరు నాయకులు తమ దారి తాము వెతుక్కుంటున్నారనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్యాకేజీలు ఇచ్చి కొడాలి నాని వంటి నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ వైపు తిప్పుకుంటున్నారని బాబు చేసిన విమర్శలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘కొడాలి నాని మనస్తత్వం అలాంటిదా... అయన అలా అమ్ముడు పోతారా... అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా చేస్తుందా... డబ్బు ఎవరు వెదజల్లుతారన్నది మొన్న కోవూరు ఉప ఎన్నికల్లోనే చూశాం. నిన్నటికి నిన్న 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా చూశాం. ఎవరు ఎలా ఖర్చు చేశారనేది ప్రజలకు బాగా తెలుసు’’ అని మేకపాటి అన్నారు.

నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ఎమ్మెల్యేకు 30 కోట్లు, 50 కోట్ల రూపాయలు ఇచ్చి తనవైపు లాక్కునే పరిస్థితి ఉందంటే రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం నమ్మరన్నారు. బాబు ఎందుకిలా మాట్లాడి పలుచన అవుతున్నారో అర్థం కావడం లేదని, టీడీపీని ఇక ఆ దేవుడే రక్షించాలని వ్యాఖ్యానించారు. బాబు తనకు తానుగా ప్రజల్లో విశ్వాసం లేకుండా చేసుకున్నారని, అందుకే ఎక్కడ భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారో అక్కడికి ఆయన పార్టీ నాయకులు వెళ్లిపోతున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు తన భవిష్యత్తును ఎలా చూసుకున్నారో.. నేను నా భవిష్యత్తును ఎలా చూసుకున్నానో మిగతా వాళ్లు కూడా అంతే కదా! ఎక్కడికి వె ళ్తే భవిష్యత్తు ఉంటుందనుకుంటారో, ఎమ్మెల్యేలుగా రాణించగలమనుకుంటారో అక్కడికి వాళ్లు వె ళ్తున్నారు. అందులో తప్పేముంది..’’ అని అన్నారు.

జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసు లేనట్టే..
మంత్రులకు న్యాయ సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ అయిన 26 జీవోలు సక్రమమేనని వెల్లడవుతోందని, అలాంటప్పుడు ఇక జగన్‌పై కేసు ఉండే ప్రసక్తే లేదని మేకపాటి చెప్పారు. ‘క్విడ్ ప్రొ కో’ ఆరోపణల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు చేస్తోందని, జీవోల జారీ సక్రమమైనప్పుడు ఈ కేసు నిలబడదన్నారు. ‘‘జగన్ నిజంగా మహానాయకుడు. వయసులో చిన్నవాడైనా, ఆయన్ను మహానాయకుడనే అంటాను. రానున్న రోజుల్లో జాతీయస్థాయిలో ఆయన పెద్ద నాయకుడవుతాడు. ఆయన్ను అన్యాయంగా ఇన్ని రోజులు జైల్లో పెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు’ అని మేకపాటి అన్నారు. జగ న్‌పై తప్పుడు విచారణ చేస్తున్నందుకు సీబీఐ ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారికంగా విద్యుత్ కోత ప్రకటన

ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌కోతలను అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతిలో మూడు గంటల పాటు కోత విధిస్తారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ పరిధిలో 5 గంటలు కోత ఉంటుంది. పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాలలో 6 గంటల విద్యుత్ కోత విధిస్తారు. పరిశ్రమలకు నెలలో 12 రోజులు పవర్ హాలీ డే, చిన్న పరిశ్రమలకు నెలలో 8 రోజులు పవర్ హాలీ డేని ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!