YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 26 August 2012

కదలిన యువతరంగం..ఆకట్టుకున్న కళాబృందం

జై జగన్..జైజై వైఎస్సార్ సీపీ...వైఎస్సార్ అమర్హ్రే...నినాదాల తో మేడ్చల్ రహదారి ప్రతిధ్వనించింది. జవహర్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన యువత మహానేత వైఎస్సార్‌పై, జననేత జగన్‌పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బయలు దేరినప్పటి నుంచీ జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకునేవరకూ ఆమె కాన్వాయ్ ముందు వాహనాల్లో ర్యాలీగా సాగారు. స్థానిక ఫైరింగ్ కట్ట నుండి జవహర్‌నగర్ ప్రధాన రహదారి మీదుగా సభావేదిక వరకూ వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించగా, విగ్రహం ఎదుట అసంపూర్తి నిర్మాణంతో కంకరపోసి ఉండడంతో పూలమాల వేయకుండా వెనుదిరిగిన యువకులు.... స్థానిక కాంగ్రెస్, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేయకపోయినా గుండెల్లో కొలువుంచుకుని పూజ చేస్తామన్నారు. 

ఆకట్టుకున్న కళాబృందం
బహిరంగ సభకు మధ్యాహ్నం నుంచే జనం తరలిరావడంతో కళాకారులు తమ ఆటపాటలతో వారిని ఉత్తేజపరిచారు. ప్రవీణ్‌కుమార్ కళాబృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ బృందం ఆలపించిన ‘పుణ్యభూమిలో పుట్టిన పులిబిడ్డా....,చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు......,కదలిరా..జగనన్న....,వైఎస్ విజయమ్మకు వందనాలు....’అన్న పాట లు ఆహుతులను రంజింపజేశాయి.

అంతా జగన్‌మయం
బహిరంగసభకు తరలివచ్చిన అభిమానులంతా వైఎస్ జగన్ మాస్క్‌లను ముఖాలకు తగిలించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరూ జగన్ మాస్క్‌లు ముఖాలకు తగిలించుకోవడంతో సభ అంతా జగన్‌మయమైంది. మరోవైపు జనం భారీగా తరలిరావడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!