YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 27 August 2012

ప్రజా సమస్యలపై పోరాటం: వైఎస్ఆర్ సీపీ

ప్రజా సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తక్షణం అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. విద్యుత్‌ సమస్యలు, శిశుమరణాలు, రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశమై సమీక్ష జరిపారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అందించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీ సరైన వేదికని పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

ఎడాపెడా విద్యుత్ కోతలతో రాష్ట్రం అంథకారంలో మగ్గుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆపార్టీ అభిప్రాయపడింది. భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి, మంత్రులు తమ పదవుల కాపాడుకునేందు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారే తప్పా... ప్రజల సమస్యలను పట్టించుకోవటంలేదని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర నేతలు విఫలమయ్యారని ఆమె విమర్శించారు. పొరుగు రాష్ట్రాలను చూసి అయినా బుద్ధి తెచ్చుకోవాలని శోభానాగిరెడ్డి హితవు పలికారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ప్రజా సమస్యలు పట్టవని శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమే పరమావధిగా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు. నేడు రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనుసరించిన విధానాలే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, తులసిరెడ్డిల అవాకులు, చెవాకులపై వాటిపై తాము స్పందిచబోమని శోభా నాగిరెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వీహెచ్ లాంటి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!