YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 10 October 2012

ఈ కష్టాలు కొంతకాలమే.... జగన్ కోసం (sakshi)

జగన్‌గారు తనని ఎంతమంది అవమానపరిచినా, ఎన్ని బాధలు పెట్టినా భారమంతా దేవుని మీద వేసి మౌనంగా ఉన్నారు. బలవంతులమని విర్రవీగే చాలామందికి త్వరలోనే సమాధానం రాబోతోంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్నట్లుగా కోట్లాదిమంది ప్రజలు చీమల్లా బారులుతీరి జగన్‌గారిని సిఎం చేయాలని కంకణం కట్టుకున్నారు.

సర్వమత శ్రేయోభిలాషి అయిన రాజశేఖరరెడ్డి గారిని అమితంగా ప్రేమించే కోట్లాదిమంది కుటుంబాలలో మా కుటుంబం ఒకటి. రామరాజ్యంలా ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఆయన మరణంతో అస్తవ్యస్తంగా మారిపోయింది. రామాయణంలో మంధరలాంటి వాళ్ళు, భారతంలో శకుని లాంటి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఒక మాట, ఆయన పోయిన తరువాత వేరొక మాట మాట్లాడి అన్నెంపున్నెం ఎరుగని జగన్ గారిని జైలుకు పంపేటంతగా కుట్ర చేశారు. జగన్ గారికి బెయిల్ రావాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాం.

ఈ రాజ్యాంగ యంత్రాంగం, అధికార యంత్రాంగం, ప్రతిపక్ష పార్టీలు కలిసి - జగన్ చిన్నవాడు ఏమీ చేయలేడు - అనే అపోహతో జైల్లో పెట్టించారు. పురాణ గాథల్లో ప్రహ్లాదుడు చాలా చిన్నవాడు, హిరణ్యకశిపుడిని ఎదిరించే ధైర్య సాహసాలు లేనివాడు. కానీ నీతినియమాలతో విష్ణుమూర్తిని పూజించి తనకోసం అవతారమే మార్చేంతగా ప్రసన్నం చేసుకుని నరసింహ అవతారంతో రాక్షస సంహారం గావించాడు. అలాగే పవిత్ర బైబిలు గ్రంథంలోని ‘ఫిలిష్తీయుడైన గొల్యాతు’ అను ఏడడుగుల శూరుడిని దావీదు అనే పదమూడేళ్ళ బాలుడు ఐదు చిన్న రాళ్ళను ఆయుధంగా చేసుకుని తన శక్తితోను, బలంతోను కాక ‘యుద్ధం యెహోవాదే’ అని గొల్యాతును ఓడించాడు. 

జగన్‌గారు కూడా తనని ఎంతమంది అవమానపరిచినా, ఎన్ని బాధలు పెట్టినా భారమంతా దేవుని మీద వేసి మౌనంగా ఉన్నారు. బలవంతులమని విర్రవీగే చాలామందికి త్వరలోనే సమాధానం రాబోతోంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్నట్లుగా కోట్లాదిమంది ప్రజలు చీమల్లా బారులుతీరి జగన్‌గారిని సిఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం, సిబిఐ తీరు చూస్తే పల్లెటూర్లలో కోతిని ఆడించే తీరులా ఉంది. ఎందుకంటే కోతికి ట్రైనింగ్ ఇచ్చి... అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారిలా సైకిల్ తొక్కు అంటే వాడు చెప్పినట్లు కోతి చేస్తుంది. 

ఆడవాళ్లు అని కూడా చూడకుండా నడిరోడ్డు మీద మాతృమూర్తి విజయమ్మగారిని, సోదరి షర్మిల, భారతిలతో పోలీసులు ప్రవర్తించిన తీరు కోట్లాది ప్రజల, ఆడపడుచుల కళ్లలో నీళ్లు రప్పించాయి. భర్తను పోగొట్టుకుని ఒకవైపు, కొడుకు జైల్లో వుండి మరోవైపు తల్లడిల్లే విజయమ్మగారిని, వారి కుటుంబాన్ని ఎవరు ఎంత ఓదార్చినా ఆ బాధ తీరేది కాదు. వాళ్ళ కన్నీళ్ళు, ప్రజల కన్నీళ్ళు దేవుడు భద్రం చేసి ఉంచాడు. అవి త్వరలో ఆశీర్వాద జల్లులై వైయస్సార్ కుటుంబానికి, వైయస్సార్ పార్టీకి రానున్నాయి. ‘శ్రమ పొందినవాడే దైవ మానవుడు’ (దేవుడులాంటిమనిషి) అని ఒక మహనీయుడు ప్రవచించాడు. ఈ కష్టాలు కొంతకాలమే. త్వరలో జగన్ బయటికొస్తారు. కోట్లాదిమంది చేసే పూజలు, నమాజ్‌లు, ప్రార్థనలు ఆయనకు వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తాయి.
జోహార్ వైయస్సార్... జై జగన్.
- ఎ. శారదా శ్రీనివాస్, హైదరాబాద్



రానున్నది జగనన్న రాజ్యమే...

ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రమైన రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఒకవైపు పరిపాలన సక్రమంగా సాగడం లేదు. మరొకవైపు కరెంటు సమస్య, పెరుగుతున్న డీజిల్ ధరలు, రాని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, అన్నిరకాల ఛార్జీలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత మహానేత వైయస్సార్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించిన ప్రజలు ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతూ చస్తూ బతుకుతున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలుచేస్తాడని వారు భావిస్తున్నారు. అందుకే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటుచూసినా జగన్ హవానే కనిపిస్తోంది. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోంది. దీనిని చూసి ఓర్వలేని అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు జగన్‌పై ఏదో ఒకరకంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. 

జగన్మోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి నూతన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయనపై కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే జగన్‌ను అక్రమ ఆస్తుల కేసులో ఇరికించి జైలుపాలు చేశారు. అయినా ఆయన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనం. దీనినంతటినీ నిశితంగా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం రానున్న ఎన్నికల్లో తమదైన శైలిలో తీర్పునిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి, కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

- గోనె శ్రీకాంత్, భిక్కనూర్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిలా

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!